iDreamPost
android-app
ios-app

సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో డ్ర‌గ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం

  • Published Aug 04, 2025 | 11:26 AM Updated Updated Aug 04, 2025 | 11:26 AM

విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు.

విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు.

  • Published Aug 04, 2025 | 11:26 AMUpdated Aug 04, 2025 | 11:26 AM
సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో డ్ర‌గ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం

విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు సైతం జరుపుతున్నారు. అదే మత్తులో హత్యలు, అత్యాచారాల వంటి ఆరాచకాలు ఎన్నో. అలాంటి డ్రగ్స్‌ను అరికట్టేందుకు త‌న‌వంతు బాధ్య‌త‌గా హీరో కృష్ణసాయి ప్ర‌చార చిత్రాల‌ను తీస్తున్నారు.

డ్ర‌గ్స్‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందించిన హీరో కృష్ణసాయి ప‌లు ప్ర‌చార చిత్రాల‌ను రూపొందిస్తున్నారు. కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ సంద‌ర్బంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆవరణలో హీరో కృష్ణసాయి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొందించాం. గ‌వ‌ర్న‌ర్లు, పోలీస్ విభాగంతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ ప్ర‌శంసలు వెల్లువెత్తాయి. ప్రతి సినిమాకి ముందు ‘స్మోకింగ్ డేంజర్’ అని హెచ్చరికలు చేసే మెసేజ్ వలన యువతలో అవ‌గాహ‌న క‌లిగడంతో సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం బాగా తగ్గిపోయింది, సినిమా మాధ్య‌మం వ‌ల్ల ప్ర‌జ‌లు ప్రభావితం అవుతారు.

అందుకే ఇప్పుడు డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు మేం రూపొందించిన పాట‌ను ‘డేంజర్’ అనే సినిమాలోనిది. ఈ సినిమా యువతను మార్పు దిశగా నడిపిస్తుందని నమ్మకం ఉంది,” అని అన్నారు. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాలు, ఉద్యమాలు ముందుకు వెళ్లాలంటే మీడియా మద్దతు కీలకం, అందుకు ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం కావాలి,” అంటూ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు హీరో కృష్ణ‌సాయి. ఇటీవ‌ల డ్ర‌గ్స్‌పై పాట రూపొందించిన‌ హీరో కృష్ణసాయి అందులో న‌టించారు. ఈ ప్ర‌చార చిత్రానికి ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అప్పటి గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ, కేంద్ర క్యాబినెట్ మంత్రి కిష‌న్ రెడ్డి, తెలంగాణ‌ డీజీపీ జితేందర్‌, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఐపిఎస్, ఇంటెలిజెన్స్ ఐజి సుమతి, అదనపు డీజీపీ జిహెచ్‌పి రాజు, నార్కోటిక్ బ్యూరో చీఫ్ అదనపు డిజిపి సందీప్ శాండిల్య, ఇతర ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను ఈ డ్రగ్స్ పాటను వీక్షించి హీరో కృష్ణసాయిని అభినందించారు.