iDreamPost
android-app
ios-app

ఆ రెండిటిలో ఒకటి వెనక్కు తగ్గినట్టే !

  • Published Aug 04, 2025 | 4:48 PM Updated Updated Aug 04, 2025 | 4:48 PM

మొన్నటివరకు సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్. టాలీవుడ్ లో సెప్టెంబర్ 25న అతి పెద్ద క్లాష్ జరగబోతుందని. కొద్దీ రోజుల తర్వాత ఓజి మూవీ వెనక్కు తగ్గుతుందని అనుకున్నారు. హరి హర రిలీజ్ అయిన కొద్దీ రోజులకు ఓజి రిలీజ్ అవ్వడం కష్టం అని భావించారు. సో అఖండ 2 మాత్రమే సోలోగా వస్తుందని భావించారు.

మొన్నటివరకు సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్. టాలీవుడ్ లో సెప్టెంబర్ 25న అతి పెద్ద క్లాష్ జరగబోతుందని. కొద్దీ రోజుల తర్వాత ఓజి మూవీ వెనక్కు తగ్గుతుందని అనుకున్నారు. హరి హర రిలీజ్ అయిన కొద్దీ రోజులకు ఓజి రిలీజ్ అవ్వడం కష్టం అని భావించారు. సో అఖండ 2 మాత్రమే సోలోగా వస్తుందని భావించారు.

  • Published Aug 04, 2025 | 4:48 PMUpdated Aug 04, 2025 | 4:48 PM
ఆ రెండిటిలో ఒకటి వెనక్కు తగ్గినట్టే !

మొన్నటివరకు సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్స్. టాలీవుడ్ లో సెప్టెంబర్ 25న అతి పెద్ద క్లాష్ జరగబోతుందని. కొద్దీ రోజుల తర్వాత ఓజి మూవీ వెనక్కు తగ్గుతుందని అనుకున్నారు. హరి హర రిలీజ్ అయిన కొద్దీ రోజులకు ఓజి రిలీజ్ అవ్వడం కష్టం అని భావించారు. సో అఖండ 2 మాత్రమే సోలోగా వస్తుందని భావించారు. మరి కొద్దీ రోజులకు అఖండ 2 డేట్ డిసెంబర్ కు చేరిందనే టాక్ వచ్చింది. కానీ ఈ రెండు సినిమాలు పోటా పోటీగా తగ్గేదేలే అని.. సెప్టెంబర్ 25 డేట్ నే లాక్ చేసుకున్నట్టు క్లారిటీ వచ్చేసింది. పైగా ఓజి మూవీ నుంచి రీసెంట్ గా ఓ సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచింది. సెప్టెంబర్ 25 డేట్ ను కన్ఫర్మ్ చేసేందుకు ఆ సాంగ్ రూపంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది అనే టాక్ కూడా ఉంది.

అటు అఖండ 2 నుంచి కూడా ఈ మధ్య ప్రకటనలు రావడంతో.. ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అనే రేంజ్ లో వార్ తప్పదని అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు డౌట్ క్లియర్ అయిపోయింది. ఈ రెండిటిలో అఖండ 2 సినిమా వెనక్కు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఖండ 2 రేస్ నుంచి తప్పుకున్నట్లు ఇన్సైడ్ టాక్. దానికోసం చర్చలు జరిపి.. క్లారిటి వచ్చిన తర్వాతే ఓజి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారట. అసలు అఖండ 2 ఎందుకు వెనక్కు తగ్గింది అంటే.. ఇక్కడ సమస్య కాంపిటీషన్ కాదు. అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉందట. అందుకోసం దాదాపు డిసెంబర్ లోనే ఎదో ఒక డేట్ ను లాక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక జరిగితే రిలీజ్ డేట్స్ లో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇప్పటికే విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.