Swetha
ముప్పై శాతం వేతనాలు పెంచితే తప్ప పనిలోకి రామని చెప్పడంతో.. దాదాపు నిన్న జరగాల్సిన చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో అటు నిర్మాతలు కూడా అంత మొత్తం అమౌంట్ చెల్లించడం అవ్వదని తేల్చి చెప్పేశారు.ప్రస్తుతం బయట ఉద్యోగాలతో పోలిస్తే ఇప్పటికే కార్మికులకు ఎక్కువ మొత్తంలోనే ఇస్తున్నామని.. ఇక తమ వలన కాదని నిర్మాతలు చెబుతున్నారు

ముప్పై శాతం వేతనాలు పెంచితే తప్ప పనిలోకి రామని చెప్పడంతో.. దాదాపు నిన్న జరగాల్సిన చాలా వరకు షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో అటు నిర్మాతలు కూడా అంత మొత్తం అమౌంట్ చెల్లించడం అవ్వదని తేల్చి చెప్పేశారు.ప్రస్తుతం బయట ఉద్యోగాలతో పోలిస్తే ఇప్పటికే కార్మికులకు ఎక్కువ మొత్తంలోనే ఇస్తున్నామని.. ఇక తమ వలన కాదని నిర్మాతలు చెబుతున్నారు. దీనితో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిల్మ్ ఫెడరేషన్ వారు ఎక్కడ తగ్గకపోవడంతో.. నిర్మాతలు కొత్త మార్గాలను కనుగుని కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటినుంచి ఎలాంటి యూనియన్స్ తో సంబంధం లేకుండా నిర్మాతలే ఎప్పటికప్పుడు ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. కొత్త వాళ్ళను పనిలోకి తీసుకోవాలని అనుకున్నారట. పైగా వారికి ఆ పనికి తగినట్లు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా కల్పించాలని చూస్తున్నారట. దానికోసం ఇప్పుడు మొత్తంగా 22 విభాగాలకు సంబంధించి ఓ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
దీనిలో ఎడిటింగ్ , మేకప్ , కాస్ట్యూమ్స్ , ప్రొడక్షన్, ఆర్ట్ వర్క్, కొరియోగ్రఫీ వంటివి చాలానే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు Atfpg.com లో అప్లై చేసుకోవచ్చని సూచించారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూడా ఆ లింక్ ను షేర్ చేశారు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో వర్క్ చేయాలనీ అనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు సూచించారు. సో ఇప్పటినుంచి మెంబెర్ షిప్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. టాలెంట్ ఉన్న వారికి పని కలిగించడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Tollywood jobs for New talent pic.twitter.com/Tt1BVhCOpu
— devipriya (@sairaaj44) August 4, 2025