iDreamPost
android-app
ios-app

సూర్య చేసిన గొప్ప పని.. సోషల్ మీడియాలో వైరల్

  • Published Aug 05, 2025 | 12:25 PM Updated Updated Aug 05, 2025 | 12:25 PM

అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న హీరో సూర్య. కొన్నేళ్లుగా సరైన సినిమాలు పడక సూర్య సక్సెస్ ట్రాక్ తప్పాడు కానీ.. ఒకప్పుడు సూర్య సినిమాలు ఎలా ఉండేవో అందరికి తెలుసు. అందుకే వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే సూర్య ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న హీరో సూర్య. కొన్నేళ్లుగా సరైన సినిమాలు పడక సూర్య సక్సెస్ ట్రాక్ తప్పాడు కానీ.. ఒకప్పుడు సూర్య సినిమాలు ఎలా ఉండేవో అందరికి తెలుసు. అందుకే వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే సూర్య ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

  • Published Aug 05, 2025 | 12:25 PMUpdated Aug 05, 2025 | 12:25 PM
సూర్య చేసిన గొప్ప పని.. సోషల్ మీడియాలో వైరల్

అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న హీరో సూర్య. కొన్నేళ్లుగా సరైన సినిమాలు పడక సూర్య సక్సెస్ ట్రాక్ తప్పాడు కానీ.. ఒకప్పుడు సూర్య సినిమాలు ఎలా ఉండేవో అందరికి తెలుసు. అందుకే వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నా సరే సూర్య ఫ్యాన్ బేస్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా సూర్య క్యారెక్టర్ కు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ సర్వీస్ చేయడంలో సూర్య ఎప్పుడు ముందు ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ కాకుండా సూర్య అగరం అనే ఫౌండేషన్ ను స్థాపించాడు. దాని ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నాడు.

ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులను చదివిస్తున్నాడు. పేదవారిని , అనాథలను ఈ ఫౌండేషన్ లో చేర్చుకుని.. కేజీ నుంచి పిజి వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు. దీనికోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాడు. ఆ ఫౌండేషన్ రన్ చేయడం కోసం తమ ఇంటిని కూడా ఇచ్చేసారు సూర్య ఫ్యామిలీ. తాజాగా ఈ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం సూర్య గొప్పదనాన్ని మరింత మందికి చేరువ అయ్యేలా చేసింది.

ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 8 వేల మంది తమ చదువును పూర్తిచేసారట. అందులో 1800 మంది ఇంజనీర్లు .. 51మంది డాక్టర్స్ ఉన్నారట. వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఫౌండేషన్ తమ జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దిందో.. వారు ఎంత ఎత్తుకు ఎదిగారో చెప్తుంటే సూర్య భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో మంది సూర్య గొప్పదనాన్ని కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముందు కూడా సూర్య ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలను చేయాలనీ అంతా ఆశిస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.