iDreamPost
android-app
ios-app

నాగార్జున మాస్టర్ ప్లాన్… వర్క్ అవుట్ అయ్యేలానే ఉంది.

  • Published Aug 05, 2025 | 1:16 PM Updated Updated Aug 05, 2025 | 3:16 PM

ఇండస్ట్రీలో కొత్త హీరోలు.. కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తరాలు మారుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకప్పటి హీరోల తమ టాలెంట్ ను కనబరుస్తూ కొత్త సినిమాలను తీస్తూనే ఉన్నారు. కానీ వారి సెకండ్ ఇన్నింగ్స్ అంత సజావుగా సాగుతున్నట్టు మాత్రం అనిపించడం లేదు. ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు మారింది కాబట్టి ఇక హిట్లు ప్లాపులు అనేవి కామన్.

ఇండస్ట్రీలో కొత్త హీరోలు.. కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తరాలు మారుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకప్పటి హీరోల తమ టాలెంట్ ను కనబరుస్తూ కొత్త సినిమాలను తీస్తూనే ఉన్నారు. కానీ వారి సెకండ్ ఇన్నింగ్స్ అంత సజావుగా సాగుతున్నట్టు మాత్రం అనిపించడం లేదు. ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు మారింది కాబట్టి ఇక హిట్లు ప్లాపులు అనేవి కామన్.

  • Published Aug 05, 2025 | 1:16 PMUpdated Aug 05, 2025 | 3:16 PM
నాగార్జున మాస్టర్ ప్లాన్… వర్క్ అవుట్ అయ్యేలానే ఉంది.

ఇండస్ట్రీలో కొత్త హీరోలు.. కొత్త డైరెక్టర్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తరాలు మారుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకప్పటి హీరోలు తమ టాలెంట్ ను కనబరుస్తూ కొత్త సినిమాలను తీస్తూనే ఉన్నారు. కానీ వారి సెకండ్ ఇన్నింగ్స్ అంత సజావుగా సాగుతున్నట్టు మాత్రం అనిపించడం లేదు. ప్రేక్షకులు సినిమాలను చూసే తీరు మారింది కాబట్టి ఇక హిట్లు ప్లాపులు అనేవి కామన్. హీరోలు కూడా ప్లాపులను పట్టించుకోకుండా కొత్త సినిమాల కోసం రెడీ అవుతూనే ఉన్నారు. ఇక వీరిలో కింగ్ నాగ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో ముందుకు కదులుతున్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. నాగార్జున ఇప్పటివరకు తనకు ఉన్న ఇమేజ్ ఫ్రేమ్ నుంచి బయటకు రావాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు.

ఇటు హీరోగా తన సినిమాలు తానూ చేస్తూనే. వేరే సినిమాలలో తన క్యారెక్టర్ స్ట్రాంగ్ గా అనిపిస్తే ఆ సినిమాలను  చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన కుభేర సినిమాలో క్యారెక్టర్ అలాంటిదే. ఈ సినిమాలో నాగ్ పెర్ఫార్మెన్స్ కు, స్క్రీన్ ప్రెజెన్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు కూలి మూవీలో నాగ్ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కూలి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో నాగ్ లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో తనని ఆ క్యారెక్టర్ కోసం ఒప్పించడానికి డైరెక్టర్.. ఏడు సార్లు నేరేషన్ ఇచ్చారట.  దాదాపు ఆరు నెలలు నాగ్ వెంట తిరిగితే కానీ నాగ్ ఈ సినిమాకు సైన్ చేయలేదట. తానె కొన్ని మార్పులను కూడా చెప్పారట. వాటి అన్నిటికి లోకేష్ ఓకే చెప్పకనే నాగ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారట.

అంటే నాగార్జున తన క్యారెక్టర్స్ విషయంలో ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో ఇక్కడే అర్ధమౌతుంది. ఇక ముందు ముందు నాగ్ ఎలాంటి క్యారెక్టర్స్ ను ఎంచుకుంటాడో చూడాలి. ఇలాంటి బలమైన క్యారెక్టర్స్ పడితే కనుక.. నాగ్ ట్రాక్ రికార్డ్స్ మారిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కూలి విషయంలో మాత్రం ముందు నుంచే నాగ్ క్యారెక్టర్ కు విపరీతమైన హైప్ ఉంది. లోకేష్ , రజిని లు సైతం పలు సంధర్భాల్లో .. కూలీ కథ అంతా సైమన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని చెప్పారు. సో నాగ్ కెరీర్ లో మొదటి సారి విలన్ రోల్ లో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.