iDreamPost
android-app
ios-app

విజయ్ చేయాల్సింది రజినీ చేస్తున్నాడా..? లోకేష్ ట్విస్ట్ ఇచ్చాడే!

  • Author ajaykrishna Published - 01:55 PM, Thu - 12 October 23
  • Author ajaykrishna Published - 01:55 PM, Thu - 12 October 23
విజయ్ చేయాల్సింది రజినీ చేస్తున్నాడా..? లోకేష్ ట్విస్ట్ ఇచ్చాడే!

లియో.. లియో.. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ పేరు మార్మోగిపోతుంది. దళపతి విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ లియో. మాస్టర్ తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. దసరా ఫెస్టివల్ సందర్బంగా సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రెజెంట్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుండి ప్రేక్షకులలో హైప్ రెట్టింపు అయ్యిందని చెప్పాలి. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. తదుపరి లియోని అందులో యాడ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కట్ చేస్తే.. లియో తర్వాత లోకేష్.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘తలైవార్ 171’ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే.. కమల్, విజయ్, సూర్య, రజినీకాంత్, కార్తీ, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి.. ఇలా దాదాపు తమిళ స్టార్స్ అందరిని చాలా తక్కువ టైమ్ లో కవర్ చేసేస్తున్నాడు లోకేష్. ఇప్పుడు తలైవార్ 171తో రజినీ సినిమా డ్రీమ్ కంప్లీట్ కాబోతుంది. అయితే.. ప్రస్తుతం లియో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్.. తలైవార్ 171 గురించి కొన్ని క్రేజీ విషయాలు షేర్ చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అదేంటంటే.. తలైవార్ 171 కథను సూపర్ స్టార్ కోసం ఖైదీ కంటే ముందే రాసుకున్నాడట. ఆ తర్వాత రజినీని కలిసి కేవలం 20 నిముషాలు నేరేషన్ ఇవ్వగా.. కథ నచ్చి వెంటనే రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే.. అదే కథను రజినీ కంటే ముందే దళపతి విజయ్ కి చెప్పాడు లోకేష్. కథ విన్నాక.. అసలు ఇలాంటి కథను ఇప్పటిదాకా తాను వినలేదు అని విజయ్ చెప్పినట్లు లోకేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం లోకేష్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మధ్యలో లోకేష్ కి ఎందుకు వినిపించావ్? ఆ కథను విజయ్ ఓకే అంటే చేసేద్దాం అనుకున్నావా? అని అంటున్నారు నెటిజన్స్. ఏదోకటిలే మొత్తానికి రజినీ, లోకేష్ కాంబో సెట్ అయ్యిందనే ఆనందంలో ఉన్నారు తలైవార్ ఫ్యాన్స్. మరి రజినీ, లోకేష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique