Lokesh Kanagaraj: కూలీ మూవీ.. లోకేశ్ DISCO థియరీ.. నెక్ట్స్ ఎవరు? తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

Lokesh Kanagaraj, Coolie Movie, Disco Theory: సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించే కూలీ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ Disco థియరీని ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా నెక్ట్స్ రివీల్ అయ్యే హీరోలు ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Lokesh Kanagaraj, Coolie Movie, Disco Theory: సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించే కూలీ మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ Disco థియరీని ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా నెక్ట్స్ రివీల్ అయ్యే హీరోలు ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

లోకేశ్ కనగరాజ్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన సినిమాలతో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడు. ‘మా నగరం’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన లోకేశ్.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఓ ట్రెండ్ ను సెట్ చేశాయి. ఖైదీ, మాస్టర్, లియో, విక్రమ్ మూవీలు ఎంతటి సంచలన విజయాన్ని సాధించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి లోకేశ్ ప్లాన్ చూస్తే, దిమ్మతిరగడం ఖాయం. ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇక నుంచి ఒకలెక్కగా ఉండబోతోంది. దాంతో అతడి ప్లానింగ్ కి ఇండియానే షేక్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

‘కూలీ’ సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి వచ్చే ఒక్కో అప్డేట్ తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. రజినీ సినిమాతో లోకేశ్ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. ఇక సహజంగానే లోకేశ్ సినిమాలు అంటే ఓ రకమైన, ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ ఉంటుంది. కూలీ సినిమాలో కూడా అదే ఉంది. అయితే మనకు చూపించింది కొంత.. మిగిలింది కొండంతగా తెలుస్తోంది. అవును రజినీ-లోకేశ్ మూవీలో మీరు ఊహించని క్యాస్టింగ్ ఉండబోతోంది. అసలు విషయం ఏంటంటే? ఈ సినిమాను అనౌన్స్ చేసిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని బాగా హైలెట్ చేశారు. ఇప్పుడు ఆ పదాల్లోని అక్షరాలకు సంబంధించి ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు. అందులో భాగంగానే మలయాళ టాలెంటెడ్ యాక్టర్ సౌబిన్ సాహిర్ ను ‘దయాల్’ అంటూ పరిచయం చేశాడు. ఆ తర్వాత నాగ్ ను సైమన్ గా చూపించాడు.

దాంతో DISCOలో డి, ఎస్ రివీల్ అయ్యాయి. ఇక నెక్ట్స్ ఎవరు? అన్నదానిపై అందరి దృష్టి ఉంది. రివీల్ కావాల్సిన ఆ ముగ్గురు ఎవరు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే లిస్ట్ లో ఆమిర్ ఖాన్, సత్యరాజ్ లు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే ఉపేంద్ర ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. అతడి పాత్రను రివీల్ చేయలేదు. ఆ తర్వాత ఆమిర్, సత్యరాజ్ ల పేర్లను పరిచయం చేయనున్నట్లున్నట్లు తెలుస్తోంది. గతంలో లియోకు కూడా ఇదే తరహా థియరీని అనుసరించాడు లోకేశ్ కనగరాజ్. కూలీ కోసం ఆ ఫార్ములానే ఫాలో అవ్వబోతున్నాడన్న మాట. దాంతో ఈ రేంజ్ భారీ క్యాస్టింగ్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి లోకేశ్ మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఎవ్వరూ ఊహించని క్యాస్టింగ్ తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments