iDreamPost
android-app
ios-app

లియో తర్వాత అసలు కష్టాలు! మేనేజ్ చేస్తారా.. మెప్పిస్తారా?

  • Published Sep 13, 2023 | 12:51 PM Updated Updated Sep 13, 2023 | 1:08 PM
  • Published Sep 13, 2023 | 12:51 PMUpdated Sep 13, 2023 | 1:08 PM
లియో తర్వాత అసలు కష్టాలు! మేనేజ్ చేస్తారా.. మెప్పిస్తారా?

దక్షిణాది చిత్రపరిశ్రమలో సెన్సేషనల్ కాంబినేషన్ అనిపించుకున్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. వీరి కాంబోలో ఇప్పటికే మాస్టర్, విక్రమ్ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసేశాయి. ఇప్పుడు లియో మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. కాగా.. క్రియేటర్స్ గా వీరి టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. కానీ.. వీరిద్దరికి లియో తర్వాత ఓ బిగ్ టాస్క్ మొదలు కాబోతుందని ఎంతమందికి తెలుసు. లియో రిలీజ్ తర్వాత లోకేష్, అనిరుధ్ అసలు కష్టాలు పడబోతున్నారట. అదేంటి వీళ్ళకి కష్టాలేంటి? కెమెరా వెనుక క్రియేటర్స్ గా సక్సెస్ లో ఉన్నారుగా అనిపించవచ్చు.

ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. పాపులర్ ఫైట్ మాస్టర్స్ అన్బు-అరివు ఓ స్క్రిప్ట్ రెడీ చేశారట. అయితే ఏంటి.. ఆ సినిమాకి లోకేష్, అనిరుధ్ వర్క్ చేయబోతున్నారా? అని డౌట్ రావచ్చు. అవును.. వీరిద్దరూ కలిసి వర్క్ చేయబోతున్నారు.. కానీ, క్రియేటర్స్ గా కాదు. యాక్టర్స్ గా అంటే నమ్ముతారా! అదే నిజం. దర్శకుడు లోకేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. అన్బు అరివు సినిమాలో హీరోలుగా నటించబోతున్నారట. ఇన్నాళ్లు కెమెరా వెనుక ఉన్న వీరు.. ఈ సినిమా కోసం మేకప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతున్నారని సమాచారం. అందుకే వీళ్ళకి అసలు కష్టాలు ముందున్నాయి అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇక లియో మూవీ రిలీజ్ తర్వాత.. షూటింగ్ మొదలు కానుందట. నటులుగా ఈ సినిమా పూర్తి చేశాకే.. మళ్లీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ గా సూపర్ స్టార్ రజినీ 171 మూవీకి వర్క్ చేయనున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదంతా వినడానికి బాగుంది. కానీ.. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అనేది అసలు పాయింట్. ఎందుకంటే.. ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్స్ తో కెరీర్ పీక్స్ లో ఉన్నారు లోకేష్, అనిరుధ్. సడన్ గా అన్ని పక్కన పెట్టేసి నటులుగా మారితే.. అది ఎంత పెద్ద సవాల్ ఆలోచిస్తేనే మైండ్ పోతుంది. అంటే.. వీళ్ళు నటులు కాకూడదని కాదు. డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పటిదాకా చిన్నగా మెరిసి వెళ్లిపోయారు. కానీ.. మెయిన్ రోల్స్ అంటే.. కంగారు పుడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా వీరి సినిమాని కూడా సన్ పిక్చర్స్ వారే నిర్మిస్తుండటం విశేషం. మరి వీరిద్దరూ ఇప్పుడు హీరోలుగా యాక్టింగ్ మేనేజ్ చేస్తారా లేక మెప్పిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి వీరు యాక్టర్స్ అయితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet