దసరా పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన యాక్షన్ మూవీ లియో. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ ప్రకారం.. సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందని టాక్ ఉంది. కానీ.. వసూళ్ల పరంగా సినిమా మంచి నెంబర్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.
దసరా పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన యాక్షన్ మూవీ లియో. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ ప్రకారం.. సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందని టాక్ ఉంది. కానీ.. వసూళ్ల పరంగా సినిమా మంచి నెంబర్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి.
దసరా పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన యాక్షన్ మూవీ లియో. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రీమియర్స్ నుండి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ ప్రకారం.. సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయిందని టాక్ ఉంది. కానీ.. వసూళ్ల పరంగా సినిమా మంచి నెంబర్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన LCU సినిమాటిక్ యూనివర్స్ వల్ల లియోకి ఊహించని హైప్ వచ్చిందనేది వాస్తవం. కానీ.. లోకేష్ సినిమాని తీర్చిదిద్దిన తీరు మాత్రం అంచనాలను తలక్రిందులు చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక లియో భారీ హైప్ వలన బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ అద్భుతంగా నమోదు చేసిందని.. దాదాపు రూ. 140 కోట్లకు పైగా రాబట్టినట్లు టాక్ ఉంది. అదిగాక తమిళ, తెలుగు భాషలలో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు చేసింది. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డబ్బింగ్ సినిమాల ఓపెనింగ్స్ లో లియో కూడా నిలిచింది. అయితే.. ఫస్ట్ వీకెండ్ లియో మూవీ కలెక్షన్ నెంబర్స్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఊదరగొట్టేసారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో.. యూఎస్ లో 18 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికి సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ క్రాస్ అయ్యిందని ప్రచారం చేశారు.
ప్రస్తుతం ఇదే విషయంపై సినీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. లియో కలెక్షన్ నెంబర్స్ అన్ని మార్చేసి.. ఎక్కువ చెప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూఎస్ లో లెక్కలు కరెక్ట్ గా ఉంటాయని అంటుంటారు. కానీ.. లియో మేకర్స్ అక్కడి ట్రేడ్ వర్గాలను మేనేజ్ చేశారని.. ఫేక్ బుకింగ్స్ తో సినిమాకు లేని హైప్ క్రియేట్ చేశారనే వాదనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకోసం టీమ్ భారీగా ఖర్చు కూడా పెట్టిందని.. థియేటర్స్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ అంతా ఫేక్ స్కామ్ చేసినట్లు ప్రచారం మొదలైంది. కోలీవుడ్ లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని నమ్మించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం లియో స్కామ్ అని హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.