iDreamPost
android-app
ios-app

లియో పోస్టర్ ఖరీదు రూ. 15 కోట్లా? ఏంటి లోకేష్ ఇది నిజమా..?

  • Author ajaykrishna Updated - 12:58 PM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 12:58 PM, Tue - 3 October 23
లియో పోస్టర్ ఖరీదు రూ. 15 కోట్లా? ఏంటి లోకేష్ ఇది నిజమా..?

దళపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లియో’. ఈ సినిమాపై ప్రేక్షకులలో, అభిమానులలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఆల్రెడీ విజయ్, లోకేష్ కాంబినేషన్ లో ఇదివరకు మాస్టర్ మూవీ వచ్చి.. మంచి విజయం సాధించింది. అలాంటిది ఇప్పుడు సెకండ్ మూవీ.. అందులోనూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అంటే మామూలు హైప్ ఉంటుందా.. ప్రస్తుతం లియో చుట్టూ అదే జరుగుతోంది. లియో.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ క్రియేట్ చేసిన LCU సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతుంది. మరి లోకేష్ లియోని ఎలా కథలో జాయిన్ చేసాడో ఆ ఆసక్తి అందరిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

లియో.. భారీ అంచనాల మధ్య దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. విజయ్ తో పాటు ఈ సినిమాలో స్టార్స్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, త్రిష నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ప్రతీ విషయం ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సాహం కలిగిస్తుంది. ఇప్పటికే లియో నుండి విడుదలైన రెండు పాటలు ఫ్యాన్స్ ని ఉర్రూతలు ఊగిస్తున్నాయి. నా రెడీ, బ్యాడ్ యాస్.. ఈ రెండు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుందని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు.

కట్ చేస్తే.. ఇప్పుడు లియో ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. లియో ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కోసం మేకర్స్ దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. తాజాగా విడుదల చేసిన లియో పోస్టర్ లో.. విజయ్ కత్తి పట్టుకొని.. తోడేలుతో ఫైట్ చేస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే.. సన్నివేశం చాలా వయిలెంట్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. విజయ్ – తోడేలు కనిపిస్తున్న పోస్టర్ ఖరీదు దాదాపు రూ. 15 కోట్లు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ చూడని రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లను లోకేష్ చూపించబోతున్నాడని అంటున్నారు. మరి 15 కోట్లు ఖర్చు పోస్టర్ కోసం చేశారా? లేక ఫైట్ సీక్వెన్స్ మొత్తం కోసమా? అనేది తెలియాల్సి ఉంది. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.