iDreamPost
android-app
ios-app

‘లియో’ సెన్సార్ రివ్యూ! సినిమా ఎలా ఉండబోతుందంటే..

  • Author ajaykrishna Updated - 02:03 PM, Wed - 11 October 23
  • Author ajaykrishna Updated - 02:03 PM, Wed - 11 October 23
‘లియో’ సెన్సార్ రివ్యూ! సినిమా ఎలా ఉండబోతుందంటే..

ఇండస్ట్రీలో ప్రస్తుతం లియో బజ్ నడుస్తుంది. దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కెరీర్ లో పాన్ ఇండియా వైడ్.. వివిధ భాషలలో రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇదే. కాగా.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై ఓ రేంజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ పై ఓ రకమైన పాజిటివ్, నెగిటివ్ రెండు రకాల అభిప్రాయాలు వెలువడినా.. ఫైనల్ గా లియో లోకేష్ కనగరాజ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో స్ట్రాంగ్ బజ్ ఇంకా ఉంది. అలాగే రిలీజ్ కి దగ్గరపడుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. సినిమాలో సంజయ్ దత్, అర్జున్ కీలకపాత్రలలో కనిపిస్తున్నారు. అదిగాక విజయ్ ఇందులో డ్యూయెల్ రోల్ ప్లే చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఒక విజయ్ తన ఫ్యామిలీతో ఉంటాడు.. మరో విజయ్ లియో దాస్ గా ‘LCU’లో భాగం అవుతాడని అంచనాలు వేస్తున్నారు. కాగా.. లియోకి సంబంధించి తాజాగా సెన్సార్ రివ్యూ బయటికి వచ్చిందని సమాచారం. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి.. ఫుల్ పాజిటివ్ నోట్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే సినిమాలో కొన్ని మార్పులు సూచించారని తెలుస్తుంది. అంతేగాక.. ట్రైలర్ లో చూపించిన ఓ బూతు డైలాగ్ కూడా మ్యూట్ చేయించినట్లు టాక్.

కట్ చేస్తే.. లియో మూవీ సెన్సార్ రివ్యూ ప్రకారం.. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఇంటరెస్టింగ్ నేరేషన్ తో సాగిందట. అనిరుధ్ మ్యూజిక్.. యాక్షన్ ఎపిసోడ్స్.. విజయ్-హైనాకి మధ్య చేజింగ్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయట. అలాగే విక్రమ్, ఖైదీలకి లింక్ వేసారో లేదో చెప్పలేదు. కానీ.. ఖచ్చితంగా లింక్ ఉంటుందని గట్టిగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇక లియో మూవీ డ్యూరేషన్ 2 గంటల 44 నిముషాలని చెబుతున్నారు. ఇక సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ వారు ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో విజయ్ కి జంటగా త్రిష నటించింది. ఇవేగాక లియో మూవీ అవుట్ ఫుట్ కూడా అదిరిందని అనిరుధ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అంటే.. అనిరుధ్ కూడా ఫ్యాన్స్ మాదిరే ఎక్సయిట్ మెంట్ తో ఉన్నాడని అర్ధమవుతుంది. మరి లియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom