ఇండస్ట్రీలో సినిమాలకు కామన్ పాయింట్స్ అనేవి అప్పుడప్పుడు మ్యాచ్ అవుతుంటాయి. అవి ఆఖరి నిమిషంలో కుదిరినా.. కుదరకపోయినా ముందు అనుకున్న ఆలోచనలు మ్యాచ్ అయినట్లు తెలిస్తే తర్వాత షాక్ అవ్వడం ఫ్యాన్స్ వంతు అవుతుంది. ప్రస్తుతం ఏమాత్రం సంబంధం లేని లియో, గుంటూరు కారం సినిమాలకు సంబంధించి ఓ కామన్ లింక్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విషయం తెలిసి అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కట్ చేస్తే.. గుంటూరు కారం ప్రొడ్యూసర్ కి లియో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కాయని ఆ వార్తల సారాంశం. ఇంతకీ లియో, గుంటూరు కారంల వెనుక ఏం జరిగింది?
ఆ వివరాల్లోకి వెళ్తే.. లియో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమాపై ఓవైపు పాజిటివ్ వైబ్.. మరోవైపు నెగిటివ్ వైబ్ కూడా పరస్పరం నెలకొన్నాయి. అందుకు కారణం.. లియో ట్రైలర్ అచ్చం ఓ హాలీవుడ్ సినిమాని పోలి ఉండటమే. 2005లో వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ది హిస్టరీ ఆఫ్ వయిలెన్స్’. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని పలుమార్లు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా చెప్పాడు. అయితే.. ఇప్పుడు లియో మూవీ ట్రైలర్ చూశాక.. ఆ సినిమా నుండి స్ఫూర్తి పొందినట్లు దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. కానీ.. లియోకి LCU కి లింక్ ఎలా ఉందనేది? అందరి సందేహం.
ఇక లియో మూవీ రీమేక్ రైట్స్ ఆల్రెడీ లియో వాళ్ళు సొంతం చేసుకున్నారట. అప్పటికి త్రివిక్రమ్, సితార ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా ‘ది హిస్టరీ ఆఫ్ వయిలెన్స్’ నుండి స్ఫూర్తి పొంది మహేష్ తో సినిమా తీయాలని ప్లాన్ చేశారట. దీంతో మహేష్ తో ఒకే స్టోరీ రీమేక్(అంటే స్ఫూర్తి పొంది) ప్లాన్ చేస్తున్నారని లోకేష్ టీమ్ కి తెలిసిందట. దాంతో రెండు సినిమాలకు ఒకటే స్టోరీ అవుతుందని భావించి.. గుంటూరు కారం టీమ్ తో మాట్లాడారట. తాము ఆల్రెడీ ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నామని, సో.. మీరు డ్రాప్ అవ్వాలని లియో టీమ్ రిక్వెస్ట్ చేసిందట. అలా ‘ది హిస్టరీ ఆఫ్ వయిలెన్స్’ని పక్కన పెట్టి.. లియో తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఒప్పందం ప్రకారం తీసుకున్నారట సితార బ్యానర్ వారు. ఇది లియో, గుంటూరు కారం సినిమాల వెనుక జరిగిన స్టోరీ అని సమాచారం. మరి గుంటూరు కారం, లియో మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.