Ayodhya: ప్రాణ ప్రతిష్ట రోజున.. మెగా కోడలు మెడలో అద్భుతమైన నగ!

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురష్కరించుకుని హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. రామ్‌ పరివార్‌ నగతో దర్శనమిచ్చారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురష్కరించుకుని హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. రామ్‌ పరివార్‌ నగతో దర్శనమిచ్చారు.

ప్రతీ హిందువు కలలు గన్న ఆ క్షణం రానే వచ్చింది. అయోధ్య రామ మందిరంలో రాముడు కొలువు దీరాడు. సోమవారం రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ తంతును దగ్గరుండి జరిపించారు. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురష్కరించుకుని మెగా కోడలు, ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన మెడ నగను ధరించారు. ఆ నగ బంగారు వర్ణంలో.. మధ్యలో శ్రీరామ పట్టాభిషేక దృశ్యంలో లలిత లావణ్యంగా ఉంది.

లావణ్య మెడలో ఆ నగ అందంగా ఒదిగిపోయింది. మెడ నగకు తగ్గట్టుగా ఆమె చెవులకు బుట్ట కమ్మలు మరింత శోభ తెస్తూ ఉన్నాయి. నగ తాలూకా ఫొటోలు స్వయంగా లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘ అయోధ్యలో పుట్టిన దానిగా.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసి సంతోషిస్తున్నా. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సంగతి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆమె మెడలో అందమైన ఆ నగను చూస్తున్న నెటిజన్లు.. వ్వావ్‌ అనటంతో పాటు.. లావణ్య రామ భక్తికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక, లావణ్యకు అయోధ్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటంటే.. లావణ్య పుట్టిళ్లు అయోధ్యే, అయోధ్యలో పుట్టిన ఆమె 2012లో వచ్చిన ‘ అందాల రాక్షసి’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ మూవీ సాధించిన విజయంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ సినిమాలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ సరసన నటించారు.

ఈ చిత్ర షూటింగ్‌ సందర్భంగా ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 2023, నవంబర్‌ నెలలో వీరి పెళ్లి జరిగింది.  ఆమె నటించిన ‘తానా’ అనే తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరి, అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురష్కరించుకుని లావణ్య త్రిపాఠి డిజైన్‌ చేసిన నగపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments