iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యామిలీ కోసం లావణ్య డేరింగ్ స్టెప్! ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

  • Author ajaykrishna Updated - 03:30 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 03:30 PM, Mon - 11 September 23
మెగా ఫ్యామిలీ కోసం లావణ్య డేరింగ్ స్టెప్! ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అడుగు పెట్టేశాక అటు కెరీర్ ని, ఇటు పర్సనల్ లైఫ్.. రెండింటిని సమంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓవైపు చేయాలనుకున్న సినిమాలు చేసుకుంటూ.. మరోవైపు లవ్, మ్యారేజ్, సొసైటీలో మర్యాద లాంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే.. హీరోయిన్స్ సినిమాలలో గ్లామర్ గా కనిపిస్తే ఆదరించే ప్రేక్షకులు.. అదే హీరోయిన్ పెళ్లయ్యాక కూడా గ్లామర్ షో చేస్తే ట్రోల్ చేసేస్తారు. విపరీతంగా విమర్శించేస్తుంటారు. అందుకే కొందరు పెళ్లికి ముందే డిసైడ్ అయిపోతుంటారు.. సినిమాలు చేయాలా వద్దా? అని. ఇంకొందరు గ్లామర్, రొమాన్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంటారు.

తాజాగా మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా కీలక నిర్ణయమే తీసుకుందట. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది లావణ్య. ఆ తర్వాత చాలామంది హీరోలతో సినిమాలు చేసింది. అదే వరుసలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కూడా సినిమాలు చేసింది లావణ్య. వీరిద్దరూ కలిసి అంతరిక్షం, మిస్టర్ సినిమాలు చేశారు. మరి ఎప్పుడు లవ్ లో పడ్డారో గానీ.. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకొని, త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి వేకెషన్స్ కి వెళ్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నారు.. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. అంతా ఓకే. కానీ.. చాలామంది హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలలో కంటిన్యూ అవుతున్నారు. ఈ విషయంలో లావణ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. అయితే.. ఒక్కటీ మాత్రం లావణ్య క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. పెళ్లి తర్వాత మెగా ఫ్యామిలీ పరువుకు భంగం కలగకుండా జాగ్రత్త పడుతోందట లావణ్య. వరుణ్‌ తో ఎంగేజ్మెంట్ అయ్యాక ముందే ఒప్పుకున్న కొన్ని సినిమాలు రద్దు చేసుకుందట. తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ ఓకే చేసిందట. కానీ.. కథ రీత్యా అందులో బోల్డ్‌గా ఉండటమే గాక.. రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయట. అందుకే మెగా కోడలిగా అలోచించి.. ఆ వెబ్ సిరీస్ కి నో చెప్పిందట. దీంతో విషయం కాస్త మెగాఫ్యాన్స్ కి తెలిసి అభినందిస్తున్నారు. మరి లావణ్య నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş