iDreamPost
android-app
ios-app

రాజ్ తరుణ్ ని ముంచేసిన లావణ్య గొడవ! దారుణంగా పురుషోత్తముడు కలెక్షన్స్!

  • Published Jul 29, 2024 | 4:00 PM Updated Updated Jul 29, 2024 | 4:00 PM

Purushothamudu: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు జూలై 26న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ఈ సినిమాపై లావణ్యతో జరిగిన ఇష్యు ఎఫెక్ట్ పడిందని టాక్ వినిపిస్తోంది.

Purushothamudu: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు జూలై 26న థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో ఈ సినిమాపై లావణ్యతో జరిగిన ఇష్యు ఎఫెక్ట్ పడిందని టాక్ వినిపిస్తోంది.

  • Published Jul 29, 2024 | 4:00 PMUpdated Jul 29, 2024 | 4:00 PM
రాజ్ తరుణ్ ని ముంచేసిన లావణ్య గొడవ! దారుణంగా పురుషోత్తముడు కలెక్షన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది యంగ్ హీరోలు ఎంట్రీ ఇచ్చారు. కొందరు మాత్రమే తమదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి అతికొద్ది మంది నటుల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.  ఆ తరువాత అనేక సినిమాల్లో నటించి..టాలీవుడ్ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. ఇది ఇలా ఉంటే..తాజాగా ఆయన నటించిన పురుషోత్తముడు సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం లేదని సినీ వర్గాలు అభిప్రాయా పడుతున్నాయి. లావణ్యతో గొడవ రాజ్ తరుణ్ మూవీ కలెక్షన్లను ముంచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన సినిమా పురుషోత్తముడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు రాజ్ తరుణ్ ఓ ఇష్యూలో చిక్కుకున్న సంగతి తెలిసింది. తన మాజీ ప్రేయసి లావణ్యతో రాజ్ తరుణ్ కి వివాదం జరింగింది. ఇది పోలీస్ స్టేషన్ కి వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది. అంతేకాక రాజ్ తరుణ్, లావణ్య ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. తనను  పెళ్లి చేసుకుంటానని చెప్పి.. రాజ్ తరుణ్ మోసం చేశాడని, తనకు న్యాయం జరగాలంటూ లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది.

ఆ తరువాత ఈ వివాదంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే పురుషోత్తముడు సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై రాజ్ తరుణ్ ఎంతో ఆశ పెట్టుకున్నాడు. రాజ్ తరుణ్ కెరీర్ లోని కాస్తా ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమా పురుషోత్తముడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఊహించన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. మూడు రోజులకు కలిపి కేవలం రూ.0.59 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.  ఇకపోతే ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో రేంటెడ్ పద్ధతిలోని రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. వాటి వాల్యూ 1.22 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

ఇక దానితో పాటు పురుషోత్తముడు సినిమా 1.8 కోట్ల షేర్ కలక్షన్లను రాబడితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. అయితే ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూస్తే.. ఆ పరిస్థితి కష్టంలాగనే  కనిపిస్తుంది. లావణ్య వివాదం రాజ్ తరుణ్ సినిమా కలెక్షన్లకు గండికొట్టిందని పలువురు అభిప్రాయపడుతుంది. ఆ ఇష్యూ కారణంగానే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ భీమన దర్శకత్వం వహించగా, శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్ సంస్థ పై డా రమేష్ తేజావత్ , ప్రకాష్ తేజావత్ లు పురుషోత్తముడు సినిమాను నిర్మించారు. హాసిని సుధీర్ ఈ మూవీ లో రాజ్ తరుణ్ కి జోడిగా నటించింది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio