iDreamPost
android-app
ios-app

కాపీ కాదంటూ.. ‘ఖుషి’ అసలు స్టోరీ లైన్ లీక్ చేసిన సినిమాటోగ్రాఫర్!

  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 24 August 23
  • Author ajaykrishna Updated - 12:36 PM, Thu - 24 August 23
కాపీ కాదంటూ.. ‘ఖుషి’ అసలు స్టోరీ లైన్ లీక్ చేసిన సినిమాటోగ్రాఫర్!

ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ దగ్గర పడుతుందంటే చాలు.. దాని చుట్టూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా పుట్టుకొచ్చే వార్తలలో సినిమాకు ప్రమోషనల్ స్టఫ్ గా పనికొచ్చే వాటికంటే.. సినిమాను వివాదంలో నెట్టేవి ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా గురించి అలాంటి వార్తలే వినిపించాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ లో విజువల్స్ బట్టి.. అందులో నుండి అర్ధం చేసుకున్న స్టోరీ లైన్ బట్టి.. మణిరత్నం సినిమాలకు కాపీ అంటూ ట్రోల్స్ మొదలైపోయాయి. ఖుషి దాదాపు సఖి మూవీలా ఉందంటూ.. దీనికి సఖి 2 ని టైటిల్ పెట్టాల్సిందని విమర్శలు వచ్చేశాయి.

ఈ క్రమంలో ఖుషి గురించి వచ్చిన విమర్శలు, ట్రోల్స్ అన్నింటిపై మేకర్స్ రియాక్ట్ అయి.. అవన్నీ రూమర్స్ అని, సినిమా చూశాక అలా అనిపిస్తే చెప్పండని అన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్ లో ఖుషి రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాని.. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించాడు. రొమాంటిక్ లవ్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సినిమాకు.. సాంగ్స్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖుషి సినిమాటోగ్రాఫర్ జి. మురళీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుతూ.. మధ్యలో స్టోరీ లైన్ కూడా లీక్ చేసినట్లు అనిపిస్తుంది.

ఈ సందర్బంగా సినిమాటోగ్రాఫర్ మురళీ మాట్లాడుతూ.. తాను 2005 నుండి ఇండస్ట్రీలో ఉన్నానని, అందాల రాక్షసి తర్వాత తాను చేసిన లవ్ స్టోరీ ఖుషినే అని చెప్పాడు. ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకు కావాల్సిన ప్రతిది అరేంజ్ చేశారని.. డైరెక్టర్ శివ నిర్వాణ ఫిల్మ్. మేకింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్న వ్యక్తి అని తెలిపారు. అయితే.. ప్రేమ గురించి కలలు కనే ఓ యువకుడికి లవ్, లైఫ్ అంటే మనం ఊహించిన విధంగా ఉండవని ఎలా తెలిసి వచ్చింది అనేది మూవీ నేపథ్యం అని కథ చెప్పేశారు. ఆ తర్వాత.. మణిరత్నం సినిమాలలో పీసీ శ్రీరామ్ చూపించే విజువల్స్ బ్యూటీ ఖుషిలో చూస్తారని.. అంతేగాని తాము అలాంటి సీన్స్ కాపీ కొట్టలేదు.. సీన్స్ లో ఆ ఫీల్ ఉంటుందని మురళీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మురళీ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఖుషి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet