Tirupathi Rao
కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో కాలా పాషా అలియాస్ కుర్చీతాత ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఫేమస్ తాతను పోలీసులు అరెస్టు చేశారు.
కుర్చీ మడతపెట్టి డైలాగ్ తో కాలా పాషా అలియాస్ కుర్చీతాత ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఫేమస్ తాతను పోలీసులు అరెస్టు చేశారు.
Tirupathi Rao
ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అదే కుర్చీని మడతపెట్టి సాంగ్. యూట్యూబ్ లో అది సెన్సేషన్ అయ్యింది. ఈ పాటను కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ నుంచి క్రియేట్ చేశారు. ఈ తాత యూట్యూబ్ లో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కుర్చీతాతను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతనిపై ఫిర్యాదు అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. యూట్యూబ్ లో వీడియోలతో ఫేమస్ అయిన వైజాగ్ సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
కాలా పాషా అలియాస్ కుర్చీతాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైజాగ్ సత్య, స్వాతి నాయుడు కుర్చీతాతపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుర్చీతాత తన డబ్బు కాజేసి పారిపోయాడు అని, ఇష్టమొచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. తనని బూతులు తిడుతున్నాడని సత్య చెప్పుకొచ్చాడు. అది తట్టుకోలేకే చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైజాగ్ సత్య చెప్పాడు. రెండ్రోజులుగా అతని కోసం గాలించగా.. బుధవారం పోలీసులు కుర్చీతాతను అదుపులోకి తీసుకున్నట్లు వైజాగ్ సత్య వెల్లడించాడు. కుర్చీతాత డైలాగ్ ని వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆయనను ఇంటికి పిలిపించుకుని ఆర్థిక సాయం కూడా చేశాడు. అయితే ఇదంతా జరగడానికి వైజాగ్ సత్య సహకరించాడు. అతని వల్లే కుర్చీతాత తమన్ దాకా వెళ్లగలిగాడు. ఆ విషయాన్ని తాతే స్వయంగా చెప్పాడు.
కానీ, ఎందుకో తాత చివరికి రివర్స్ అయ్యాడు. వైజాగ్ సత్య తనని మోసం చేశాడంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు. అతను కనిపిస్తే నరికేస్తా, చంపేస్తానంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే నిన్నటి వరకు బాగానే ఉన్న కుర్చీతాత- వైజాగ్ సత్య మధ్య గొడవ ఎందుకొచ్చిదంటే.. తమన్ ని కలిపించినట్లుగానే మహేశ్ బాబును కూడా కలిపించాలంటూ కుర్చీతాత పట్టుబట్టాడట. అయితే అది సాధ్యం కాదంటూ వైజాగ్ సత్య తేల్చిచెప్పాడు. అప్పటి నుంచే వీళ్ల మధ్య చెడిందని వైజాగ్ సత్య చెప్పుకొచ్చాడు. జనవరి 12న మొదటిసారి వైజాగ్ సత్యను బూతులు తిడుతూ కాలా పాషా యూట్యూబ్ వీడియో చేశాడు. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్టేషన్ కి వచ్చి ఆ ఛానల్ వాళ్లు తిట్టమంటే తిట్టానంటూ చెప్పాడట. ఆ తర్వాత మళ్లీ వైజాగ్ సత్యను తిడుతూ వీడియోలు చేస్తుడటంతో.. పోలీసులను ఆశ్రయించినట్లు వాపోయాడు. ఛానల్స్ వాళ్లు మందుపోయించి తిట్టిస్తున్నారని చెప్తున్నాడట. అతని బూతులు తట్టుకోలేకే వైజాగ్ సత్య చివరికి పోలీసులతో అరెస్టు చేయించినట్లు చెప్పుకొచ్చాడు. మరి.. కుర్చీతాత అరెస్టు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.