Krishna Kowshik
ఓ వీడియోతో అనుకోకుండా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కుమారి ఆంటీ. హైదరాబాద్ హైటెక్ సిటీలో చిన్న ఫుడ్ వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్న ఆమెకు పాపులారిటీ తెచ్చింది ఆ వీడియో. అయితే తాజాగా ఆమె డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్‌లో సందడి చేసింది ఆంటీ. అంతేకాకుండా
ఓ వీడియోతో అనుకోకుండా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కుమారి ఆంటీ. హైదరాబాద్ హైటెక్ సిటీలో చిన్న ఫుడ్ వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్న ఆమెకు పాపులారిటీ తెచ్చింది ఆ వీడియో. అయితే తాజాగా ఆమె డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్‌లో సందడి చేసింది ఆంటీ. అంతేకాకుండా
Krishna Kowshik
‘హాయ్ నాన్న చెప్పండి.. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ.. కొంచెం కొంచెం తినండి’ అంటూ కొసరి కొసరి వడ్డించిన కుమారి అంటీ.. ఈ పలకరింపులతోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ఫుడ్ వ్యాపారం చేసుకుని బ్రతుకుతోన్న ఆమె పేరు ఓవర్ నైట్ మారుమోగిపోయాలా చేసిన వీడియో ‘ టూ లివర్స్ ఎక్స్ ట్రా.. మీది థంజెడ్ అయ్యింది’. దీంతో ఆమెను ట్రోల్ చేయడం స్టార్ చేశారు నెటిజన్లు. ఆ నెగిటివిటీతోనే పాపులర్ అయ్యి.. పాజిటివిటీని సొంతం చేసుకుంది ఈ ఆంటీ. ఈమెకు ఫిదా అయిపోయిన ప్రజలు.. కుప్పలు తెప్పులుగా ఆమె హోటల్ దగ్గరకు వెళ్లి తినడమే కాకుండా.. ఆమె నుండి యూట్యూబర్లు చిన్న బైట్ అయినా తీసుకునేవారు. దీంతో ఓ చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. అనుకోకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్‌గా మారింది.
అంతేనా ఇదే పాపులారిటీతో శ్రీదేవీ డ్రామా కంపెనీ, జీ తెలుగులో ప్రసారమౌతున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వంటి సీరియల్లో యాక్ట్ చేసింది. ఇక ఆమె వీడియోతో సెలబ్రిటీలు సైతం రీల్స్, షాట్స్ చేసి మెస్మరైజ్ చేసిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్‌లో డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించారు. దీనికి గెస్టులుగా విజయ్ దేవరకొండ,మెగా స్టార్ చిరంజీవి వచ్చారు. సుమ యాంకరింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేశారు కుమారీ ఆంటీ. అనుకోకుండా సోషల్ మీడియా స్టార్ కావడంపై భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇది నేను ఊహించలేదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు.. ఈ రోజు ఇంత మందిలోకి తీసుకు రావడానికి కారణమైంది సోషల్ మీడియా. అలాగే నాకు సపోర్టు చేసిన వారికి థాంక్యూ’ అని చెప్పారు.
‘ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు వెళ్లొచ్చు. చదువు లేదని బాధపడుతూ ఉంటే.. చదువు లేదని బాధపడొద్దని ‘భక్తి, ముక్తికి చదువులెందుకు, ఆత్మ శాంతి ఉంటే చాలు అదే దైవము. చెరువులో చేపకెవరు ఈత నేర్పిరి..? బావిలోని కప్పకెవరు బాస నేర్పిరి? అడవిలోని హంసకెవరు ఆట నేర్పిరి.? ఆ చెట్టు మీద కోయలకెవరు కూత నేర్పిరి..? పుట్టలోని పాముకెవరు బుసలు నేర్పిరి? పుట్టిన బాలుడకెవరు ఏడ్పు నేర్పిరి..?’ అని మా అమ్మమ్మ, నాన్నమ్మ ధైర్యం చెప్పారు. చదువు ముఖ్యం కాదు.నీ ఆత్మ విశ్వాసం,పని నేర్చుకుని, ప్రతి ఫలం చేసుకుంటూ ముందుకు వెళితే అంతే మంచే జరుగుతుందని వాళ్లు చెప్పారు. కానీ ఎప్పుడు నేను ఎక్స్ ఫర్ట్ చేయలేదు. పెద్దల మాట వింటే.. అది విజయం అని నా విషయంలో ప్రూవ్ అయ్యింది. సో అందరికి ఒకటే చెబుతాను పెద్దల మాట అందరు వింటే.. విజయమే కానీ అపజయం ఉండదు’ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోతో ఆమె మరోసారి ప్రేక్షకులే కాదూ సెలబ్రిటీ హృదయాలను కొల్లగొట్టింది.