Arjun Suravaram
Murari Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిన చిత్రం మురారి. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మురారి మూవీ ఫ్లాప్ అంటూ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దర్శకుడు కృష్ణవంశీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Murari Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిన చిత్రం మురారి. త్వరలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మురారి మూవీ ఫ్లాప్ అంటూ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దర్శకుడు కృష్ణవంశీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Arjun Suravaram
సినీరంగానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు చేసే కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇది ఇలా ఉంటే కొందరు సెలబ్రిటీలు నెటిజన్ల అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు విచిత్రమైనా, కోపం తెప్పించే ప్రశ్నలు అడుగుతుంటారు. అలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు సైతం గట్టిగానే సమాధానం ఇస్తుంటారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన మురారి సినిమాపై ఓ నెటిజన్ నెగిటీవ్ పోస్టు పెట్టాడు. దానికి డైరెక్టర్ కృష్ణవంశీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇంతకీ అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సూపర్ హిట్ సినిమాలతో అమ్మాయిల గుండెల్లో యువరాజు, ప్రిన్స్ గా మహేశ్ నిలిచారు. ఇక ఆయన సినీ కెరీర్ లో క్లాసిక్ మూవీగా నిలిచిన సినిమా మురారీ. క్రేజీ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా సోనాలి బింద్రే నటించింది.
ఇక మురారీ సినిమాకు మణిశర్మ అందించిన పాటలు, మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. 2001లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది. కృష్ణవంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాలో ఒకటిగా మురారీ నిల్చింది. ఇది ఇలా ఉంటే.. చాలా ఏళ్ల తరువాత ఆగష్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో ఎక్స్‌వేదికగా దర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో ముచ్చటించారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ ‘మురారి ఫ్లాప్ మూవీ’ అంటూ పోస్టు పెట్టాడు. దానికి కృష్ణవంశీ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. ‘‘హలో అండీ.. నేను మురారి నిర్మాత ఎన్.రామలింగేశ్వరరావుగారి నుంచి రూ.55 లక్షలకు 5 ఏళ్ల పాటు ఈస్ట్ గోదావరి జిల్లా హక్కులను కొన్నాను. మొదటి రన్ లోనే 1 కోటి 30 లక్షలు కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే, ఈ మూవీ ఫ్లాఫ్ లేదా సూపర్‌హిట్ అనేది మీరే నిర్ణయించుకోండి’ అని కృష్ణ వంశీ అన్నారు. అంతేకాదు, ‘మురారి’ సినిమాకు తెలుగు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
మహేశ్‌బాబు అమితంగా ఇష్టపడే చిత్రాల్లో ఇది కూడా ఒకటని కృష్ణవంశీ తెలిపారు. కొందరు వ్యక్తులు నెగెటివ్ కామెంట్లు చేసినా, మనం సహనంతో ఉండాలంటూ మరో నెటిజన్‌కు సమాధానం ఇచ్చారు. వాళ్ల బతుకులు అవి.. మన సంస్కారం ఇదని, వాళ్లను క్షమించి వదిలేయండి, ఎవరినీ కించపరచవద్దంటూ ఆయన చెప్పుకొచ్చారు. పొరపాటున మనం బ్యాలెన్స్ కోల్పోతే వాళ్లు సక్సెస్ సాధించినట్లు అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ చేసిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.