iDreamPost
android-app
ios-app

Allu Arjun-Trivikram: 1000 కోట్లతో బన్నీ-త్రివిక్రమ్ మూవీ! ఏదో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

  • Published Jul 21, 2024 | 12:15 PM Updated Updated Jul 21, 2024 | 12:15 PM

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన పిచ్చెక్కించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు ప్రముఖ నిర్మాత తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన పిచ్చెక్కించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు ప్రముఖ నిర్మాత తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 21, 2024 | 12:15 PMUpdated Jul 21, 2024 | 12:15 PM
Allu Arjun-Trivikram: 1000 కోట్లతో బన్నీ-త్రివిక్రమ్ మూవీ! ఏదో గట్టిగానే ప్లాన్ చేశారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కించే తీరు పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఫిల్మ్ మేకర్స్ సైతం తమ పంథా మార్చుకుని మరీ మూవీస్ ను రూపొందిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలతో పాటుగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను తీసే రేంజ్ కు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు బిగ్ స్టార్స్ నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా మూవీసే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటిని మించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ. 1000 కోట్లతో ఈ మూవీని రూపొందించనున్నట్లు సమాచారం.

మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది. తన మాటలతో ప్రేక్షకులను మాయచేయడంలో గురూజీ సిద్ధహస్తుడు. అయితే ఇప్పటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని మాత్రమే తన సినిమాలను తెరకెక్కించాడు. కానీ ఇక నుంచి పాన్ ఇండియా మూవీస్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే మూవీతోనే దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. బన్నీ-గురూజీ కాంబోలో హాసిని అండ్ హారికా క్రియేషన్స్ పతాకంపై ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మహాభారతంలోని రెండు పర్వాలను బేస్ చేసుకుని త్రివిక్రమ్ ఈ కథను సిద్దం చేస్తున్నాడని, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు పాత్రల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని టాక్.

ఇక ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకురావాలని గురూజీ భావిస్తున్నాడట. దానికి కారణం లేకపోలేదు. పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బన్నీతో పాత పంథాలో మూవీస్ తీయడం కరెక్ట్ కాదని మాటలమాంత్రికుడి ఆలోచన.  అందుకే పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీని తీయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ మూవీని ఏకంగా రూ. 1000 కోట్లతో నిర్మించబోతున్నారని, నిర్మాత ఫైనాన్షియర్లను వెతుక్కోవాలని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చాడు. దాంతో ఈ చిత్రంపై ఇంకా హైప్ క్రియేట్ అయ్యింది. బన్నీ-గురూజీ రెండేళ్లుగా కష్టపడి ఈ ప్రాజెక్ట్ అనుకున్నారని, ఇది చాలా పెద్ద సినిమా అని, దాని ప్రీ ప్రొడక్షన్ పనులకే ఏడాదిన్నర పడుతుందని బన్నీ వాసు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఈసారి బన్నీ-త్రివిక్రమ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అంటూ ఫ్యాన్స్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ రూ. 1000 కోట్లతో నిర్మించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet