iDreamPost
android-app
ios-app

యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ యాక్ట్రెస్ బ్యాగ్రౌండ్ తెలిస్తే..? మైండ్ బ్లాకే..!

  • Published Sep 03, 2024 | 7:30 AM Updated Updated Sep 03, 2024 | 7:30 AM

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా..? లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మతి పోవాల్సిందే. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా..? లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మతి పోవాల్సిందే. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 03, 2024 | 7:30 AMUpdated Sep 03, 2024 | 7:30 AM
యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ యాక్ట్రెస్ బ్యాగ్రౌండ్ తెలిస్తే..? మైండ్ బ్లాకే..!

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా..? ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ప్రగతి, శరణ్య, పవిత్రా లోకేశ్, సురేఖా వాణి, సన, హేమలా సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకుంటుంది. లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదర్‌గా చేస్తోంది. ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్. నటనకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తున్న ఈ నటీమణి.. తెలుగులో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తమిళయన్ అయిన ఈ నటి..ముంబయిలో పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన ఆమె.. చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌గా ట్రైనింగ్ తీసుకుంది. అలాగే ట్రావెట్ కన్సల్టెంట్‌గా వర్క్ చేసింది. బాలకృష్ణన్ నటరాజన్‌ను వివాహం చేసుకున్నాక.. ఉద్యోగం, పిల్లలు అంటూ గడిపేసింది. కానీ ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం.

కళ్యాణి నటరాజన్ ముంబయిలో థియేటర్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకుని, అనేక నాటకాల్లో నటించింది. అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అలా ఓ జ్యువెలరీ యాడ్ చేసే అవకాశం వచ్చింది. అలా 2013లో సెట్టై తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది గోరీ తేరే ప్యార్ మే అనే చిత్రంలోనూ నటించింది. తలైవా ఆఫర్ వచ్చినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి వరుసగా తమిళ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యింది కళ్యాణి. ఇక తెలుగులో బాలకృష్ణ డిక్టేటర్ మూవీతో తెరంగేట్రం ఇచ్చింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఎక్కువగా హీరోల మదర్‌గా నటిస్తూ మెప్పిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది.

తెలుగులో గీతా గోవిందం, శైలజా రెడ్డి అల్లుడు, పడి పడి లేచే మనసు, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అలా వైకుంఠపురం, భీష్మ, వరుడు కావలెను, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేరు వీరయ్య, అమిగోస్, రావణాసుర, రంగబలి, సిద్దార్థ్ రాయ్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో కూడా తేరీ, సర్కార్, మాస్టర్, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆల్మోస్ట్ యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించింది. ఇవే కాదు కీ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. సినిమాలో కాదు.. యాడ్స్ కూడా చేస్తూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. షార్ట్ ఫిలిం అరంగేట్రం దారో మాట్ (2017)లో నెగిటివ్ రోల్ చేసింది. తన భర్త బాలకృష్ణన్ నటరాజన్‌తో కలిసి ముంబయికి చెందిన థియేటర్ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ క్రియేషన్స్ స్థాపించింది.

 

View this post on Instagram

 

A post shared by Kalyani (@kalyani_natarajan)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş