iDreamPost
android-app
ios-app

షూటింగ్‌లో ఆ నాలుగు గంటలు నరకం!

  • Published Jul 25, 2024 | 10:51 AM Updated Updated Jul 25, 2024 | 10:51 AM

Malavika Mohanan: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది మోడల్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. అలాంటి వారిలో నటి మాళవిక మోహన్ ఒకరు.

Malavika Mohanan: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది మోడల్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. అలాంటి వారిలో నటి మాళవిక మోహన్ ఒకరు.

  • Published Jul 25, 2024 | 10:51 AMUpdated Jul 25, 2024 | 10:51 AM
షూటింగ్‌లో ఆ నాలుగు గంటలు నరకం!

సినీ ఇండస్ట్రీలో ఛాన్స్ రావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. చాలామంది ఇండస్ట్రీలోకి నేరుగా రాకుండా మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంటారు. అలా ఎంతోమంది మోడల్స్ హీరోయిన్లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో నటి మాళవిక మోహన్ ఒకరు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి.. 2013 లో మాలీవుడ్‌లో వచ్చిన ‘పట్టం పోల్’ మూవీ ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది. ఇటీవల ఓ మూవీ షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్ ‘పట్టం పోల్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది. కెరీక్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మాళవిక మోహన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తుంది. ఇటీవల ఓ మూవీ షూటింగ్‌లో తనకు ఎదురై అనుభవం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫిల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకడుు పా రంజీత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ వర్క్ బిజీలో ఉన్నారు. ఈ సందర్బంగా మాళవిక మోహన్ ‘తంగాలన్’ షూటింగ్ లో తాను నాలుగు గంటలు నరకం అనుభవించానని చెప్పింది.

Malavika Mohan

‘తంగలాన్’ మూవీలో మాళవిక మోహన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మోహన్ మాట్లాడుతూ.. ‘ ఒకరోజు నేను సెట్‌కు వెళ్లే సరికి పెద్ద గేదె ఉంది.. డైరెక్టర్ రంజీత్ వచ్చి ఆ గేదెపై ఎక్కగలవా అని అడిగారు. ఏదో ఫన్నీకోసం అనుకున్నా.. కానీ నా మేకప్ పూర్తయిన తర్వాత ఆ గేదెపై కూర్చోమన్నారు. ఆ సీన్ కష్టం అని చెప్పాలనుకున్నా ఆయన వినలేదు. భయంతో ఆ షూట్ పూర్తిచేశాను. ఇక మేకప్ కి నాలుగు గంటలు పట్టింది.. ఎండలో షూటింగ్ చేశారు. ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి.. రోజూ సెట్స్ లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్ మొత్తం ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. వాస్తవానికి ఈ సీన్ ఉంటుందని మొదట దర్శకుడు నాకు చెప్పలేదు. మొత్తానికి ఆ సీన్ పర్ఫెక్ట్ గా పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్ల కోసం బాగా ఐదు..ఆరు గంటల సేపు బాగా ప్రాక్టీస్ చేశాం. సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ మూవీ ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పారు.