iDreamPost
android-app
ios-app

కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్! రొమాంటిక్ వీడియో షేర్ చేసిన  కాబోయే భార్య!

  • Published Jul 15, 2024 | 10:19 AM Updated Updated Jul 15, 2024 | 5:20 PM

Kiran Abbavaram Marriage Date: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. కిరణ్ కు కాబోయే భార్య, హీరోయిన్ రహస్య గోరఖ్ అతడి బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి విషెస్ చెప్పింది. పనిలో పనిగా తమ పెళ్లి డేట్ ను కూడా రివీల్ చేసింది.

Kiran Abbavaram Marriage Date: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. కిరణ్ కు కాబోయే భార్య, హీరోయిన్ రహస్య గోరఖ్ అతడి బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి విషెస్ చెప్పింది. పనిలో పనిగా తమ పెళ్లి డేట్ ను కూడా రివీల్ చేసింది.

  • Published Jul 15, 2024 | 10:19 AMUpdated Jul 15, 2024 | 5:20 PM
కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్! రొమాంటిక్ వీడియో షేర్ చేసిన  కాబోయే భార్య!

కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. విభిన్న కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నేడు(జూలై 15న) తన పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. దాంతో సినీ ప్రముఖులతో పాటుగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. కిరణ్ కు కాబోయే భార్య హీరోయిన్ రహస్య గోరఖ్ మాత్రం ప్రత్యేకంగా ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసి విషెస్ చెప్పింది. పనిలో పనిగా తమ పెళ్లి డేట్ ను కూడా రివీల్ చేసింది. ఇంతకీ రాజావారు.. రాణీవారి పెళ్లెప్పుడంటే?

కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ‘రాజావారు రాణీగారు’ సినిమాలో జోడీగా నటించిన వీరిద్దరు ఆ టైమ్ లోనే ప్రేమలో పడ్డారు. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఉంచారు. ఇక ఈ ఏడాది మార్చిలో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతో పాటుగా ఆ నెలలోనే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ పెళ్లి ఎప్పుడు అన్న సంగతి మాత్రం వెల్లడించలేదు. నేడు(జూలై 15)న కిరణ్ తన బర్త్ డే ను జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో కిరణ్ కు కాబోయే భార్య రహస్య గోరఖ్ తన ఫియాన్సికి ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ఓ రొమాంటిక్ వీడియోను షేర్ చేసింది. పనిలోపనిగా తమ పెళ్లి ఏరోజో కూడా చెప్పుకొచ్చింది. కిరణ్ ను భర్త అని పిలిచేందుకు ఆగలేకపోతున్నానని, దానికి ఇంకా 38 రోజులే టైమ్ ఉందని రాసుకొచ్చింది. అంటే వీరి పెళ్లి ఆగస్టు 22న జరగబోతుందన్నమాట.

కాగా.. కిరణ్ అబ్బవరం కెరీర్ విషయానికి వస్తే.. లేటెస్ట్ గా ‘క’ అనే టైటిల్ తో ఓ మూవీ అనౌన్స్ చేసి అందరికి షాకిచ్చాడు. అదీకాక తన బర్త్ డే రోజున టీజర్ రాబోతోంది. దాంతో పాటుగా మరికొన్ని సిమాలు చేస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇక రహస్య గోరఖ్ మాత్రం తన తొలి సినిమా రాజావారు రాణీవారు తోనే కెరీర్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా సినిమాలను పక్కనపెట్టి.. సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ కావడంతో.. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Rahasya (@rahasya_gorak)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss