Swetha
సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు అందరిని ఆలోచింపచేసిన వార్తా.. చిన్న పాపా పై ప్రనీత్ హనుమంతు కామెంట్స్ . ఈ విషయంలో హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో తాజగా రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు అందరిని ఆలోచింపచేసిన వార్తా.. చిన్న పాపా పై ప్రనీత్ హనుమంతు కామెంట్స్ . ఈ విషయంలో హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరో తాజగా రేవంత్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Swetha
సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒకరి గురించి.. ట్రోలింగ్స్ , మీమ్స్ వస్తూనే ఉంటాయి. సెలెబ్రిటీల విషయంలో అయితే అది ఈ మధ్య చాలా సహజం అయిపోయింది. ఒకవేళ ఆ కామెంట్స్ లిమిట్ దాటితే నేరుగా వారే దానిపై స్పందించి.. సరైన సమాధానాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఓ రకం అయితే. అసలు ఎటువంటి సంబంధం లేని వీడియోస్ ను కూడా పని కట్టుకుని మరి కామెంట్స్ చేస్తుంటారు మరి కొంతమంది. ఈ క్రమంలోనే ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్.. తండ్రి కూతుళ్లపై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా అందరిని ఆలోచింపచేశాయి. ఈ విషయంలో ఎంతో మంది వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వారిలో టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ఇక ఈ విషయంలో తాజాగా ఈ హీరో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
సోషల్ మీడియాలో ముఖ్యంగా చిన్న పిల్లలపై జరుగుతున్న కామెంట్స్ ను సాయి ధరమ్ తేజ్ ఖండించారు. దీనిపై మా అసోసియేషన్ సైతం స్పందించి.. పిల్లలపై అలాంటి కామెంట్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఖండించిన తీరుకు.. సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్పుడే స్పందించారు. దానికి సంబంధించిన పోస్ట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయి ధరమ్ తేజ్ ను కలిశారు. ఇక మీదట ఇలాంటి విషయాలలో వెంటనే స్పదించి.. దానికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరి ఇక మీదటైన డార్క్ కామెడీ , మీమ్స్ , ట్రోల్ల్స్ పేరిట జరుగుతున్న ఘటనలకు చెక్ పడుతుందేమో చూడాలి.
ఇప్పటికి ఈ విషయంలో ఎంతో మంది సెలబ్రిటీస్ స్పందిస్తూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే మృగాలా నుంచి.. పేరెంట్స్ తమ పిల్లలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా సోషల్ మీడియా వలన ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో .. అంతకంటే ఎక్కువ చెడు పరిణామాలే అందరికి ఎదురౌతూ ఉన్నాయి. ఇప్పటికే ఎంతో ఇలాంటి ట్రోలింగ్స్ వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతే కాకుండ తమ ప్రాణాలను సైతం తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా మీమర్స్ , ట్రోలర్స్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆపేయాలని అందరు భావిస్తున్నారు. ఇక మీదటైనా ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.