iDreamPost
android-app
ios-app

‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ వివరాలివే!

  • Author ajaykrishna Published - 03:35 PM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 03:35 PM, Sun - 17 September 23
‘కింగ్ ఆఫ్ కొత్త’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ వివరాలివే!

ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినా ఓటిటిలోకి ఇట్టే వచ్చేస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమాలన్నీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ఇదివరకు మినిమమ్ థియేటర్స్ నుండి వెళ్ళిపోయాక.. ఓటిటి రిలీజ్ కి కనీసం కొన్ని నెలల సమయం తీసుకునేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. రోజులు మారుతున్నకొద్దీ అన్నింట్లో మార్పులు వచ్చినట్లే.. ఓటిటి రిలీజ్ ల విషయంలోను మార్పులు వచ్చేశాయి. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా.. ఇప్పుడు అలాగే వచ్చేస్తుంది. దుల్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.

మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సోలో హీరోగా గతేడాది సీతారామం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్.. ఈ ఏడాది ‘కింగ్ ఆఫ్ కొత్త’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మాస్ ఇమేజ్ కోసం పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఓనం ఫెస్టివల్ సందర్బంగా కింగ్ ఆఫ్ కొత్త.. ఆగష్టు 24న థియేటర్స్ లో విడుదలైంది. అభిలాష్ జోషి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కాగా.. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ కి సిద్ధమైందని తెలుస్తుంది.

కింగ్ ఆఫ్ కొత్త డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. వినాయక చవితి తర్వాత.. అంటే సెప్టెంబర్ 22 నుండి కింగ్ ఆఫ్ కొత్త.. అన్ని భాషలలో స్ట్రీమింగ్ కాబోతుందని టాక్ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే బయటికి రాలేదు. మరి సైలెంట్ గా ఏమైనా ప్లానింగ్ జరుగుతుందేమో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కింగ్ ఆఫ్ కొత్త సినిమాని జీ స్టూడియోస్ వారితో కలిసి దుల్కర్ కూడా నిర్మించడం విశేషం. ఇక దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తాను హీరోగా చేస్తూనే.. ప్రభాస్ కల్కిలో, సూర్య 43లో కీలకపాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. మరి దుల్కర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio