iDreamPost
android-app
ios-app

రీరిలీజ్ సిద్దమైన కింగ్ నాగార్జున్ ‘శివ’ మూవీ!

  • Published Jul 20, 2024 | 3:01 PM Updated Updated Jul 20, 2024 | 3:01 PM

Siva Movie: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్  అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ సినిమాలనే కాకుండా మాస్ సినిమాలు కూడా చేశారు. ఆయనకు సాలిడ్ హిట్ అందించిన సినిమాల్లో ‘శివ’ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Siva Movie: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్  అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ సినిమాలనే కాకుండా మాస్ సినిమాలు కూడా చేశారు. ఆయనకు సాలిడ్ హిట్ అందించిన సినిమాల్లో ‘శివ’ ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Jul 20, 2024 | 3:01 PMUpdated Jul 20, 2024 | 3:01 PM
రీరిలీజ్ సిద్దమైన కింగ్ నాగార్జున్ ‘శివ’ మూవీ!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరో సినిమా విడుదలైన రోజు వివిధ కారణాలతో చూడలేకపోయామే అనే బాధతో ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఫీలింగ్ ను అభిమనులకు నుంచి దూరం చేస్తున్నాయి ఈ రిరిలీజ్ లు ప్రారంభమయ్యాయి.  ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ హిట్ ఫార్ములాగా కొనసాగుతోంది. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమాలను సైతం తిరిగి మరోసారి బిగ్ స్క్రీన్ పై  ప్రదర్శిస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు  అభిమానులు కూడా ఈ రీరిలీజ్ సినిమాలను ఆదరిస్తుండంతో నిర్మాతలను సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కాగా..వారి జాబితాలో కింగ్ నాగార్జున్ చేరనున్నారు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా శివ కూడా రిరీలిజ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు, కింగ్  అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లాస్ సినిమాలనే కాకుండా మాస్ సినిమాలు కూడా చేశారు. తనదైన నటనతో ప్రత్యేకంగా  ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆయన ఖాతాల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే  అలా ఆయనకు సాలిడ్ హిట్ అందించిన సినిమా ‘శివ’. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెన్సేషనల్ హిట్  నిల్చిన “శివ” ని ఎవరూ మర్చిపోలేరు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ మ్యాడ్ మాస్ డ్రామా మూవీ అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది.

Siva Re release date

శివ సినిమా కూడా మరోసారి బిగ్ స్ర్కీన్ పై చూసేందుకు అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు శివ సినిమా రీ రిలీజ్ కి  సిద్ధమైందని తెలుస్తోంది. ఈ ఆగస్ట్ 29 కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా  రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.  ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కగా..అమల హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్ళ భరణి కీలక పాత్రలో తదితరులు నటించారు. అలాగే మాస్ట్రో ఇళయరాజా ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్ ఈ సినిమకు అందించారు. ఇప్పటికే మురారీ సినిమా రీరిలీజ్ కి సిద్ధమైన సంగతి తెలిసింది. ఇదే సమయంలో శివ సినిమా రీరిలీజ్ గురించి కూడా బయటకు రావడంతో చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి.. టాలీవుడ్ వినిపిస్తోన్నట్లు నాగ్ బర్త్ డేకు  శివ రీ రిలీజ్ అవుతుందా అనే విషయం తెలియాలంటే..ఆగష్టు 29 వరకు ఆగాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet