iDreamPost
android-app
ios-app

కిక్ మూవీలో ఇలియానా చెల్లి గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

  • Published Jul 17, 2024 | 11:13 AM Updated Updated Jul 17, 2024 | 11:13 AM

మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్. ఇక ఈ సినిమాలో ఇలియానాకు చెల్లిగా నటించిన ఈ అమ్మడు ఎవరికైనా గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్. ఇక ఈ సినిమాలో ఇలియానాకు చెల్లిగా నటించిన ఈ అమ్మడు ఎవరికైనా గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

  • Published Jul 17, 2024 | 11:13 AMUpdated Jul 17, 2024 | 11:13 AM
కిక్ మూవీలో ఇలియానా చెల్లి గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే?

మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ‘కిక్’ మూవీ కూడా ఒకటి. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ మూవీని 2009లో తెరెక్కించగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో హీరోయిన్ ఇలియానా నటించింది. అలాగే తమిళ్ నటుడు శ్యామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇకపోతే కిక్ సినిమాలో రవితేజ తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడంతో పాటు ఎమోషనల్ కూడా అలరించారు.

అంతేకాకుండా.. ఈ సినిమాలో రవితేజ్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలైతే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. అంతలా కిక్ సినిమా థియేటర్స్ లో చూస్తున్నంత సేపు ప్రేక్షకులు పడిపడి నవ్వుకుంటారు. ఇదిలా ఉంటే.. కిక్ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఈమె ఆ సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎంతలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

కిక్ సినిమాలో ఇలియానా కు చెల్లిగా నటించిన ఈ అమ్మాయి ఎంతమందికి గుర్తుంది. అయితే ఈ సినిమాలో ఈ బ్యూటీ ముందుగా రవితేజను ఇష్టపడ్డ అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక ఈమె పేరు ‘ఆషీకా బతిజా’. ఈమె తెలుగులో కిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. కాగా, ఈ సినిమా తర్వాత ఆషికా మరి ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. కానీ, ఈమె కిక్ సినిమాకు ముందు గయానా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా 2004వ సంవత్సరం లో విడుదలైంది. ఇక అక్కడికి ఐదేళ్ల తర్వాత కిక్ సినిమాలో నటించింది. అయితే కిక్ సినిమాలో ఈమె కనిపించింది కొంతసేపు అయినా హీరోయిన్ కు మించిన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత ఆషికాకు అంతగా ఆఫర్లు రాలేదు. దీంతో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ చదువులపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలోనే లండన్ వెళ్ళింది. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలో మంచిగా రాణించిన ఈ అమ్మడు అందులోనే పూర్తిగా స్థిరపడిపోయింది.ఇంతకి ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది ఏం చేస్తుందో తెలుసుకోవాలని నెటిజన్స్ ఎప్పటి నుంచో తెగ ఆరాటపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆషీకా పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అలాగే బిడ్డకు కూడా జన్మనించింది ఈ చిన్నది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. రెగ్యులర్ గ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి, ప్రస్తుతం కిక్ మూవీ నటి ఆషీకా బతిజా లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş