Arjun Suravaram
Kiccha Sudeep: ప్రస్తుతం కర్నాటకలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్నిఅక్కడి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ పే కి సంబంధించి ఓ వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూలో కిచ్చ సుధీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Kiccha Sudeep: ప్రస్తుతం కర్నాటకలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్నిఅక్కడి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ పే కి సంబంధించి ఓ వివాదం నడుస్తోంది. ఈ ఇష్యూలో కిచ్చ సుధీప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Arjun Suravaram
కన్నడ స్టార్ హీరో, కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచమయ్యాడు. అలానే కన్నడలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సుదీప్ సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే..కర్నాటకలో ప్రముఖ సంస్థ ఫోన్ పే ఇష్యూ జరుగుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సుదీప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరి.. ఆ నిర్ణయం ఏమిటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రస్తుతం కర్నాటకలో స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్నిఅక్కడి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసింది. అయితే ఈ నిర్ణయాన్ని ఫోన్ పే సంస్థ వ్యతిరేకించింది. పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇలా ప్రైవేటు సంస్థలో రిజర్వేషన్లు సైరనది కాదంటూ..ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయంపై వ్యతిరేతను వ్యక్తం చేసింది. దీంతో కన్నడలో ఫోన్ పే సంస్థ బహిష్కరణ అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు పోరాటం చేస్తున్నారు. వారి పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కస్టమర్లకు డబ్బును పంపుతున్న సమయంలో ఫోన్ పేలో ‘థ్యాంక్యూ బాస్’ అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడి జనాలు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో కిచ్చ సుదీప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారని టాక్. తనను ఆదరించిన కన్నడ ప్రజల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కన్నడ ప్రజలకు ఫోన్ పే క్షమాపణలు చెప్పకుంటే.. ఆ సంస్థతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై సుదీప్ సోమవారం అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే కన్నడిగులు ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు మద్దతుగా సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం వస్తుంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను ఫోన్ పేతో పాటు చాలా మంది బిజినేస్ మెన్లు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమవుతుంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ అందరి కంటే ముందు వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఫోన్ పే విషయంలో కిచ్చా సుదీప్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.