iDreamPost
android-app
ios-app

Salaar- KGF: సలార్ టీజర్ లో ఇవి గమనించారా? ప్రభాస్- రాఖీ భాయ్ కలవడం పక్కా!

Salaar- KGF: సలార్ టీజర్ లో ఇవి గమనించారా? ప్రభాస్- రాఖీ భాయ్ కలవడం పక్కా!

సలార్.. సలార్.. గత కొన్ని రోజులుగా నెట్టింట ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. ఆరోజు రానే వచ్చింది. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తన్న సలార్ సినిమా టీజర్ విడుదలైంది. రిలీజ్ చేసిన కొన్ని గంటల్లో 25 మిలియన్ ప్లస్ వ్యూస్, మిలియన్ ప్లస్ లైక్స్ సొంతం చేసుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. సినిమా ప్రేమికులు అంతా ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. గురువారం తెల్లవారుజామున 5.11 గంటలకు ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ మొత్తం సలార్ టీజర్ సునామీ సృష్టించింది.

ఈ టీజర్ చూశాక చాలా మంది ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే కేజీఎఫ్, సలార్ సినిమాలు రెండూ ఇంటర్ లింక్డ్ అనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విషయంలో ఊహాగానాలు, అనుమానాలు, అంచనాలు, ఆశలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఈ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అందరికీ విషయం అర్థమైపోయింది. సలార్- రాఖీ భాయ్ ఇద్దరూ కచ్చితంగా కలుస్తారని. కలవక పోయినా.. ఆ కథకు ఈ కథకు కనెక్షన్ ఉంటుందని. టీజర్ రిలీజ్ కు ముందు వరకు ఒక ఉదాహరణ చెప్పారు.

రాకీ ఎంపైర్ పై రైడ్ చేసిన సమయంలో రైడ్ సమయంలో బంగారాన్ని మైసూర్ పంపాడు. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ నంబర్ మైసూర్ పేరిట జిరిస్ట్రేషన్ చేసుంటుంది. తర్వాత టీజర్ డేట్ రివీల్ చేసిన తర్వాత రాఖీ భాయ్ సముద్రంలో మునిగిపోయే సమయంలో ఒక గోడ గడియారంలో ఉన్న సమయానికే సలార్ టీజర్ రిలీజ్ చేస్తున్నారంటూ మరో ఉదాహరణ చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈసారి స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అభిమానులు, ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

అదేంటంటే.. కేజీఎఫ్- సలార్ సినిమాలు క్రాస్ ఓవర్ అవుతాయని చెప్పాడు. ఆ హింట్ ఏంటంటే.. కేజీఎఫ్ లో చూపించిన ఒక షాట్ లో గోడౌన్ పై ఉన్న పేరు, దానికి ఎదురుగా ఉన్న ట్యాంకర్, దాని మీదు ఉన్న C-516 అనే పేరు.. ఇప్పుడు సలార్ టీజర్ లో కూడా కనిపించాయి. ఈ ఒక్క షాట్ తోనే అందరికీ సలార్ కూడా కేజీఎప్ యూనివర్స్ లో భాగమే అని క్లారిటీ వచ్చింది. మరోవైపు టేకింగ్ విషయానికి వస్తే.. అదే తరహా ఎలివేషన్స్, అదే డస్ట్, బ్లాక్ బ్యాగ్రౌండ్ చూడచ్చు.

నెట్టింట సలార్ టీజర్ విషయంలో కేజీఎఫ్ పార్ట్ 3 అనే ప్రచారం కూడా జరుగుతోంది. కొందరు ఈ టీజర్ విషయంలో అసహనం వ్యక్తం చేయడం కూడా చూడచ్చు. కేజీఎఫ్ పార్ట్ 2తో ప్రశాంత్ నీల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అవి అందుకోవాలంటే ప్రభాస్ ఇమేజ్ మాత్రమే కాకుండా.. సినిమాలో కాస్త విషయం ఉండాలి. లేదంటే ప్రశాంత్ నీల చేతిలో ప్రభాస్ బలి అవుతాడంటూ కామెంట్ చేస్తున్నారు. సలార్ టీజర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş