iDreamPost
iDreamPost
బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన తెలుగుతో సహా సౌత్ స్టేట్స్ లో కెజిఎఫ్ 2 నెమ్మదించింది కానీ నార్త్ లో మాత్రం దూకుడు తగ్గడం లేదు. అంతగా అక్కడి ఆడియెన్స్ పొగిడిన ఆర్ఆర్ఆర్ 28 రోజుల కలెక్షన్ ని కేవలం 8 రోజుల్లో దాటేసి వామ్మో అనిపించేసింది. రెండో వారంలో కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ 265 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. అదే ట్రిపులార్ చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది 255 కోట్లే. మూడు వందలు చేరుకోవడం చాలా కష్టం. రాఖీ భాయ్ మాత్రం ఆ ఫీట్ ని అవలీలగా సాధించేలా ఉన్నాడు. షాహిద్ కపూర్ జెర్సీ ఎమోషన్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం కలిసి వచ్చేలా ఉంది.
ఫైనల్ రన్ అయ్యేలోగా కెజిఎఫ్ 2 కొంచెం అటుఇటుగా 325 కోట్ల దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాజమౌళిని ప్రశాంత్ నీల్ చాలా సులువుగా ఓవర్ టేక్ చేసినట్టే. అయితే సీక్వెల్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్న కెజిఎఫ్ 2 దాన్ని పూర్తిగా వాడుకుంది. హీరోయిజం ఎలివేషన్లను నెక్స్ట్ లెవెల్ లో చూపించడంతో అక్కడి జనం ఎగబడి చూస్తున్నారు. వీక్ డేస్ లోనూ మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సో హిందీ డబ్బింగ్ వెర్షన్ పరంగా కెజిఎఫ్ 2 సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా వెళ్తోంది. బాహుబలి 2ని దాటడం అనుమానమే కానీ ఈ మాత్రం ఫీట్ సాధించడం గొప్ప విషయం. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇక్కడ మాత్రం రాఖీ భాయ్ బాగా నెమ్మదించాడు. ఈ వీకెండ్ మళ్ళీ పికప్ అయినా వచ్చే వారం ఆచార్య వస్తుంది కాబట్టి ఆపై కష్టమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కెజిఎఫ్ కి దూరంగా ఉండటం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తోంది. ఎలివేషన్లు తప్ప కంటెంట్ పెద్దగా లేదనే టాక్ వాళ్ళను ఆపుతున్న మాట వాస్తవం. ఇదంతా ఎలా ఉన్నా ఒక కన్నడ డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం మాత్రం విశేషం. అది కూడా బాలీవుడ్ లో జెండా పాతడం అంటే మాటలు కాదు. వరల్డ్ వైడ్ మొత్తం ఆరు వందల కోట్ల దాకా చేరుకున్న కెజిఎఫ్ 2 ఫైనల్ గా ఆర్ఆర్ఆర్ తరహాలో వెయ్యి కోట్లను అందుకుంటుందో లేదో చూడాలి