iDreamPost
android-app
ios-app

జెర్సీ – చాలా ఖరీదైన పాఠం

  • Published Apr 25, 2022 | 4:30 PM Updated Updated Apr 25, 2022 | 4:30 PM
జెర్సీ – చాలా ఖరీదైన పాఠం

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి హిందీలో నిర్మించిన జెర్సీ హిందీ రీమేక్ ఫైనల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మొదటి రోజు నాలుగు కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ తెచ్చుకున్న జెర్సీ నిన్న మొన్న వీకెండ్ వల్ల కొంత మెరుగుదల చూపించింది కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ స్లో అవ్వనుందని ట్రేడ్ టాక్. షాహిద్ కపూర్ ఎంత గొప్పగా నటించినా యూట్యూబ్ లో నాని హిందీ వెర్షన్ ఫ్రీగా చూసేసిన జనం మళ్ళీ ఇంకోసారి అదే సినిమాను కేవలం క్యాస్టింగ్ మార్పుతో థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడలేదు.

దీంతో ఫలితం ఇలా రివర్స్ అయ్యింది. వంద కోట్ల బడ్జెట్ అంటే కేవలం ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే కాదు. షాహిద్ కు ఇచ్చిన ముప్పై కోట్ల పైచిలుకు రెమ్యునరేషన్ తో కలిపి. కబీర్ సింగ్ భీభత్సంగా ఆడి రెండు వందల యాభై కోట్ల దాకా వసూలు చేసిన నేపథ్యంలో మన వాళ్ళు జెర్సీ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. అయితే రెండు జానర్లు పూర్తిగా విరుద్ధమైనవి కావడం విస్మరించారు. జెర్సీలో ఎంత గొప్ప ఎమోషన్ ఉన్నా కూడా అది మరీ వందల కోట్ల వెయిటేజ్ ఉన్నది కాదు. ఒకవేళ రియల్ లైఫ్ బయోపిక్ అయితే కనెక్టివిటీ ఎక్కువగా ఉండేది కానీ ఇది కేవలం ఒక స్పోర్ట్స్ మ్యాన్ కల్పిత కథ. దీంతో సహజంగానే ఇంప్రెషన్ తగ్గిపోయింది.

దీని వల్ల వచ్చే నష్టం అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీలకు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ జెర్సీతో బాలీవుడ్ లో గట్టి జెండా పాతుదామనుకున్న ప్లాన్లు మాత్రం రివర్స్ అయ్యాయి. ఫైనల్ రన్ అయ్యాక ఎంత లాస్ అనే క్లారిటీ వస్తుంది. ఇలా చూసుకుంటే ఇలాంటి సినిమాలు తెలుగులో తీసి హిందీలో డబ్బింగ్ చేసుకుంటే సేఫ్ గా బయట పడవచ్చు. పుష్ప దానికి మంచి ఉదాహరణ. అల్లు అర్జున్ కాకుండా ఇంకే హీరోతో దాన్ని రీమేక్ చేసినా ఇంత ఇంపాక్ట్ మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. అందుకే ఒరిజినాలిటీని ఫీలైన నార్త్ ఆడియన్స్ దాన్ని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ కారణాల వల్లే జెర్సీ ఒక ఖరీదైన పాఠంగా నిలిచిపోయింది