iDreamPost
android-app
ios-app

‘బలగం’ బ్యూటీ కావ్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. సన్నగా అవ్వమంటూ..!

  • Author singhj Published - 04:46 PM, Wed - 12 July 23
  • Author singhj Published - 04:46 PM, Wed - 12 July 23
‘బలగం’ బ్యూటీ కావ్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. సన్నగా అవ్వమంటూ..!

ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. ప్రతిభకు తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే విజయాల బాట పట్టొచ్చు. సినీ పరిశ్రమలోనైతే లక్ ఫ్యాక్టర్​ను చాలా కీలకంగా భావిస్తారు. ఫలానా యాక్టర్​ను తీసుకుంటే పాత్ర పండడంతో పాటు తమ సినిమాకు అదృష్టం తోడవుతుందంటే పక్కా వారిని తీసుకుంటారు మేకర్స్. ఎన్నో సినిమాలతో ఇది ప్రూవ్ అయింది. పెద్దగా నటించే ప్రతిభ లేని యాక్టర్స్ కూడా సక్సెస్​లో ఉన్నారని.. వరుస ఆఫర్లు అందుకోవడాన్ని చూసే ఉంటారు. అయితే విజయాలు మాత్రం తాత్కాలికమే.. టాలెంట్ ఉన్నవారు ఏదో ఒక రోజు తాము అనుకున్నది సాధించకమానరు.

టాలెంట్ ఉన్నవారికి లక్ ఫ్యాక్టర్ కూడా తోడైతే వారిని ఆపడం మాత్రం కష్టం. అలాంటి వారికి ఓవర్​నైట్ స్టార్​డమ్ వచ్చేస్తుంది. అలా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన వారిలో హీరోయిన్ కావ్యా కల్యాణ్​రామ్ కూడా ఒకరు. ‘గంగోత్రి’, ‘బాలు’ లాంటి పలు చిత్రాల్లో బాలనటిగా అలరించారామె. ఆ తర్వాత చాన్నాళ్లకు మళ్లీ తెరపై ‘మసూద’తో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో మంచి పేరు సంపాదించిన ఈ బ్యూటీ.. ‘బలగం’తో బ్లాక్​ బస్టర్​ హిట్ కొట్టారు. ఇందులో భావోద్వేగాలు పలికించేందుకు, నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్​లో ఆమె అద్భుతంగా నటించారు. ‘బలగం’ విజయంలో ఆమె పాత్ర కూడా ఎంతో ఉంది.

‘బలగం’ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న కావ్య.. త్వరలో ‘ఉస్తాద్​’తో ఆడియెన్స్​ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీసింహా హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్​లో కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఆమె చెప్పారు. ఒక మూవీ ఆడిషన్స్​కు వెళ్తే దర్శక నిర్మాతలు తనను బాడీ షేమింగ్ చేశారని తెలిపారు. తాను చాలా లావుగా ఉన్నానని.. ఇలా ఉంటే ఛాన్సులు రావని, సన్నగా అవ్వమని హేళన చేశారని కావ్య చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నానని ఆమె పేర్కొన్నారు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş