iDreamPost
android-app
ios-app

‘కాటేరమ్మ కొడుకును పంపింది’ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా..?

  • Published Dec 24, 2023 | 2:58 PM Updated Updated Dec 24, 2023 | 3:18 PM

‘ఈశ్వర్’గా వెండితెరపై ఎంటరై.. ‘రాఘవేంద్ర’గా అలరించాడు ‘డార్లింగ్’ ప్రభాస్. అతడిపై ఫ్యాన్స్ అభిమానం అనే ‘వర్షం’కురిపిస్తే.. బాక్సాఫీసు వద్ద ‘చక్రం’తిప్పాడు ఈ ‘చత్రపతి’. ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ అని అనిపించుకున్నాక ఈ ’బాహుబలి’కి.. సాహో అయ్యింది చిత్ర సీమ.. ఇప్పుడు ‘సలార్’ అంటూ..

‘ఈశ్వర్’గా వెండితెరపై ఎంటరై.. ‘రాఘవేంద్ర’గా అలరించాడు ‘డార్లింగ్’ ప్రభాస్. అతడిపై ఫ్యాన్స్ అభిమానం అనే ‘వర్షం’కురిపిస్తే.. బాక్సాఫీసు వద్ద ‘చక్రం’తిప్పాడు ఈ ‘చత్రపతి’. ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ అని అనిపించుకున్నాక ఈ ’బాహుబలి’కి.. సాహో అయ్యింది చిత్ర సీమ.. ఇప్పుడు ‘సలార్’ అంటూ..

  • Published Dec 24, 2023 | 2:58 PMUpdated Dec 24, 2023 | 3:18 PM
‘కాటేరమ్మ కొడుకును పంపింది’ డైలాగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా..?

బాహుబలి తర్వాత వరుస పరాజయాలతో సతమతమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్ మూవీతో భారీ హిట్ అందుకున్నాడు. మాస్ జాతర చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. డార్లింగ్ లుక్స్, యాక్టింగ్, బీజీఎం వెరసి.. బ్లాక్ బస్టర్ హిట్ అందించాయి. టాలీవుడ్ పరిశ్రమే కాదూ బాలీవుడ్ నుండి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు సుమారు రూ. 180 కోట్లు కొల్లగొట్టింది సలార్ ది సీజ్ ఫైర్. ఈ రెండు రోజుల్లో మొత్తం రూ. 295. 7 కోట్లను వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తోంది. ముఖ్యంగా శ్రియారెడ్డి, ఝాన్సీ, ఈశ్వరీరావులకు మరింత ఫేమ్ రాగా, పృధ్వీ సుకుమారన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కార్తికేయ దేవ్ ఈ మూవీతో పాపులర్ అయిపోయాడు.

వీరితో పాటు ఇందులో నటించిన ఓ అమ్మాయికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. ప్రభాస్ ఓ కీలక ఫైట్ చేస్తున్నప్పుడు ‘కాటేరమ్మ రాలేకపోయింది.. కానీ.. కాటేరమ్మ కొడుకును పంపింది’అంటూ డైలాగ్స్, యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసిందో అమ్మాయి. ప్రభాస్ ఎంట్రీ సమయంలో ‘మనల్ని కాయాలని దేవుళ్లు ఎట్లైనా రారన్నావ్ కదనే.. కానీ మన కాయడానికి దేవుళ్లు వస్తారని మొక్కుతున్నా’అంటోంది ఆ పాప. ఆ అమ్మాయి పేరు సయ్యద్ ఫర్జానా. ప్రస్తుతం ఈ అమ్మాయి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సెకండాఫ్‌లో ఈ అమ్మాయి కీలక పాత్ర పోషించింది. ఆమె నటించిన సన్నివేశాలు కంటతడి పెట్టిస్తుంటాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫర్జానా సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది. ప్రభాస్ చాలా కూల్‌గా ఉంటారని, ప్రశాంత్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని తెలిపింది. చిన్నప్పటి నుండి పలు యాడ్స్ లో నటించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత వెండితెరపైకి వచ్చింది.

ఝాన్సీ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మాయికి.. ఆడిషన్స్ ద్వారా సలార్ చిత్రంలో చేసే అవకాశం వచ్చిందట. కళ్లు చూసి డైరెక్టర్ ప్రశాంత్ సెలక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. అప్పుడు సలార్ మూవీ కోసం అని తెలియదని పేర్కొంది. ప్రస్తుతం తాను 10వ తరగతి చదువుతున్నానని తెలిపింది. నితిన్ మూవీ కోసం ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది ఈ పాప. ప్రభాస్‌తో కలిసి ఒక సీన్ ఉందని, అయితే అది మూవీలో లేదని వెల్లడించింది. ఇంత పెద్ద మూవీలో ఛాన్స్ రావడం అందులోనూ ప్రభాస్, నీల్ సినిమా అంటే చాలా సంతోషించానని పేర్కొంది. ముందు షూటింగ్ సమయంలో కాస్త టెన్షన్ పడ్డానని, తర్వాత డైరెక్టర్ నీల్ ఇచ్చిన స్పూర్తితో ఈజీగా చేశానని అన్నారు. ప్రభాస్‌తో మాట్లాడినప్పుడు.. చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపింది ఫర్జానా. తన క్యారెక్టర్ చూసుకుని నేనేనా అనుకున్నానని, అయితే ఈ క్యారెక్టర్ నచ్చుతుందని భావించానని పేర్కొంది. సలార్ మూవీ చూసి ఉన్నట్లయితే..ఈ పాప యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Farzana Sayyed (@sayyed_farzana_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet