iDreamPost
android-app
ios-app

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్​మెంట్.. తెలుగు నుంచి నిఖిల్ కార్తికేయ 2 మూవీకి పురస్కారం!

  • Published Aug 16, 2024 | 2:24 PM Updated Updated Aug 16, 2024 | 2:55 PM

Nikhil's Karthikeya 2 Wins 70th National Film Awards: టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన ఓ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో తెలుగు నుంచి ఆ సినిమా విజేతగా నిలిచింది.

Nikhil's Karthikeya 2 Wins 70th National Film Awards: టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన ఓ మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. తాజాగా ప్రకటించిన పురస్కారాల్లో తెలుగు నుంచి ఆ సినిమా విజేతగా నిలిచింది.

  • Published Aug 16, 2024 | 2:24 PMUpdated Aug 16, 2024 | 2:55 PM
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్​మెంట్.. తెలుగు నుంచి నిఖిల్ కార్తికేయ 2 మూవీకి పురస్కారం!

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం నేషనల్ అవార్డు గెలుచుకుంది. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను జ్యూరీ తాజాగా అనౌన్స్​ చేసింది. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచింది. బెస్ట్ తమిళ్ ఫిల్మ్​గా దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ పురస్కారానికి ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 1’, ఉత్తమ హిందీ చిత్రంగా ‘గుల్​మోహర్’ అవార్డులను కొల్లగొట్టాయి. ‘కార్తికేయ 2’కు అవార్డు రావడంతో అందరూ నిఖిల్​తో పాటు మూవీ టీమ్​ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

2022, డిసెంబర్ 31 తేదీ లోపు సెన్సార్ అయిన ఫిల్మ్స్​లో బెస్ట్ మూవీస్​కు ఇవాళ నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా నిఖిల్ ‘కార్తికేయ 2’ పురస్కారాన్ని గెలుచుకుంది. చందు మొండేటి డైరెక్షన్​లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్​గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలో బ్లాక్​బస్టర్​గా నిలిచింది. మొత్తంగా రూ.130 కోట్ల పైచిలుకు కలెక్షన్స్​తో బాక్సాఫీస్​ను షేక్ చేసింది. నిఖిల్ కెరీర్​లో బిగ్ హిట్​గా నిలిచింది ‘కార్తికేయ 2’. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ గ్రాండ్ సక్సెస్ అవడం విశేషం. తొలి భాగం తెలుగు వరకే పరిమితం కాగా.. సీక్వెల్​తో బాలీవుడ్ ఆడియెన్స్​కు కూడా దగ్గరయ్యాడు నిఖిల్.

కృష్ణతత్వాన్ని చెబుతూ కృష్ణుడి గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ‘కార్తికేయ 2’ను తెరకెక్కించారు దర్శకుడు చందు మొండేటి. తెలుగుతో పాటు ఉత్తరాదిన కూడా ఈ మూవీ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ‘కార్తికేయ 3’లో ఎలాంటి కాన్సెప్ట్​ను ఆధారంగా చేసుకొని ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పక్కా డివోషనల్ టచ్ ఇస్తూనే నెక్స్ట్ పార్ట్ రూపొందిస్తారని వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ‘కార్తికేయ 2’కు నేషనల్ అవార్డ్ రావడంతో ‘కార్తికేయ 3’పై అంచనాలు మరింతగా పెరిగాయి. సేమ్ టైమ్ సినిమాను మరింత ఎంగేజింగ్​గా, పక్కా ప్లానింగ్​తో తీసే బాధ్యత మేకర్స్ మీద పడింది. థర్డ్ పార్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి. మరి.. నిఖిల్ మూవీకి నేషనల్ అవార్డు రావడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.