iDreamPost
android-app
ios-app

వీడియో: కార్తీకదీపం నటికి ఛేదు అనుభవం.. తనకు ఫోన్ చేసి..!

Karthika Deepam Serial Artist Usha Rani: కార్తీకదీపం సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్న ఉషారాణి అనే నటికి చేదు అనుభవం ఎదురైంది. తనకు జరిగినట్లు మరెవరికైనా జరగచ్చు. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియో రిలీజ్ చేసింది.

Karthika Deepam Serial Artist Usha Rani: కార్తీకదీపం సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్న ఉషారాణి అనే నటికి చేదు అనుభవం ఎదురైంది. తనకు జరిగినట్లు మరెవరికైనా జరగచ్చు. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియో రిలీజ్ చేసింది.

వీడియో: కార్తీకదీపం నటికి ఛేదు అనుభవం.. తనకు ఫోన్ చేసి..!

బుల్లితెరలో కార్తీక దీపం సీరియల్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లు ఆ సీరియల్ బుల్లితెరను ఏలింది. డాక్టర్ బాబు- వంటలక్కలు కలవాలి అని పూజలు కూడా చేశారు. అయితే కార్తీకదీపం సీరయల్ ముగిసిన విషయం తెలిసిందే. మళ్లీ కార్తీకదీపం 2 సీరియల్ కూడా నడుస్తోంది. ఈ సీరియల్ లో చేస్తున్న ఒక నటికి ఊహించని ఘటన జరిగింది. అయితే తనకు జరిగిన ఒక విషయాన్ని తన అభిమానులు, నెటిజన్స్ తో పంచుకుంది. మీరు ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు చేసింది. అయితే ఆమెకు జరిగిన ఛేదు అనుభవం ఏంటి? ప్రజలు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో చూద్దాం.

ప్రజలను, నెటిజన్స్ ను అలర్ట్ చేసిన ఆ నటి పేరు ఉషారాణి. ఆమె కార్తీకదీపం 2లో కీలక పాత్రలో నటిస్తోంది. దీపకు అత్త క్యారెక్టర్ చేస్తోంది. అయితే ఈ నటికి సంబంధించి తాజాగా జరిగిన ఒక ఘటనను అభిమానులతో పంచుకుంది. అసలు ఏం జరిగిందంటే.. తనకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. దానిని తన కుమారుడు బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ కార్డులో మొత్తం రూ.5 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ ఉంది. వాళ్లబ్బాయి తరచూ కార్డులను ప్యాంటు జేబులో పెట్టి మర్చిపోతాడని ఆ కార్డును బ్లాక్ చేయకుండా వదిలేశారు. పైగా ఆ కార్డు తనకు కావాల్సిన ఆన్ లైన్ స్టోర్స్, ఇ-కామర్స్ వెబ్ సైట్స్ కి లింక్ అయి ఉండటంతో పని అయితే జరుగుతోంది కదా అని లైట్ తీసుకున్నారు.

అయితే కొన్నిరోజుల తర్వాత ఉషారాణికి ఒక అనౌన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చాలా గంభీరంగా నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను అని చెప్పాడు. మీరు ఉషారాణి కదా.. మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉందని చెప్పాడు. అయితే ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పండి అని అడిగాడు. అయితే ఆమె వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా.. మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని ప్రశ్నించింది. నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో.. అతను ఫోన్ కట్ చేశాడు. కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు. అందులో ఆవిడ ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి. ఏదో తప్పు జరుగుతోంది అనే విషయం ఉషారాణికి క్లారిటీ వచ్చింది.

అలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించేసింది. ఇదే విషయాన్ని తన ఫాలోవర్స్, ఫ్యాన్స్, నెటిజన్స్ తో పంచుకుంది. ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. మీరంతా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సూచిస్తూ ఆ వీడియో షేర్ చేసింది. ఉషారాణి చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంచి సమాచారాన్ని పంచుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు, పోలీసులు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇలా సెలబ్రిటీలు కూడా ముందుకు రావడంతో ఆ విషయం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Usha Rani (@usharani_actor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి