స్టార్ హీరో కార్తి నటించిన ‘జపాన్’ చిత్రం ఇటీవల విడుదలై బిగ్ స్క్రీన్స్‌లో సందడి చేస్తోంది. అయితే ఈ మైల్స్టోన్ మూవీ విషయంలో కార్తి తెలిసే తప్పు చేశాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
స్టార్ హీరో కార్తి నటించిన ‘జపాన్’ చిత్రం ఇటీవల విడుదలై బిగ్ స్క్రీన్స్‌లో సందడి చేస్తోంది. అయితే ఈ మైల్స్టోన్ మూవీ విషయంలో కార్తి తెలిసే తప్పు చేశాడా? అనే డౌట్స్ వస్తున్నాయి.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఉన్నంత బిగ్ హార్ట్ ఎవరికీ ఉండదేమో. ఎందుకంటే ఇక్కడి ఆడియెన్స్ భాషలకు అతీతంగా మూవీస్‌ను ఆదరిస్తుంటారు. తెలుగు చిత్రాలనే కాదు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఆఖరికి ఇంగ్లీష్ ఫిల్మ్స్‌ను కూడా మనోళ్లు ఇష్టపడుతుంటారు. టీవీల్లో వచ్చినప్పుడు చూడటమో, ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయడమో కాదు.. ఇతర భాషా చిత్రాల కోసం డైరెక్ట్‌గా థియేటర్‌కే వెళ్తుంటారు ఇక్కడి ప్రేక్షకులు. సినిమా బాగుందనే టాక్ వస్తే చాలు.. అదే భాషకు సంబంధించిందో అస్సలు పట్టించుకోరు. అందుకే ఇక్కడ తమ ఫిల్మ్స్‌ను డబ్ చేసి రిలీజ్ చేసేందుకు పర భాషా మేకర్స్ పోటీపడుతుంటారు.
పాన్ ఇండియా కల్చర్ ఈ మధ్య మొదలైంది. కానీ టాలీవుడ్ ఆడియెన్స్ ఇక్కడి స్టార్లతో పాటు పరభాషా నటులను కూడా చాన్నాళ్లుగా ఆదరిస్తూ వస్తున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్‌కు సొంత భాషైన తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ హిట్స్ ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ స్టార్ స్టేటస్ సంపాదించిన హీరోల్లో కార్తి కూడా ఒకరు. ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకి’, ‘ఖైదీ’, ‘సర్దార్’ లాంటి సినిమాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్లు అందుకున్నారాయన. అలాంటి కార్తి యాక్ట్ చేసిన రీసెంట్ ఫిల్మ్ ‘జపాన్’ మాత్రం ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకోవడంలో ఫెయిల్ అయింది. సినిమా సినిమాకు డిఫరెంట్ స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకుంటూ కమర్షియల్గానూ మంచి సక్సెస్‌లు అందుకొని ఈ రేంజ్లో నిలబడ్డారు కార్తి.
కార్తి నుంచి 25వ సినిమా వస్తోందంటే ఆడియెన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆయన రీసెంట్ మూవీ ‘జపాన్’ ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఆడియెన్స్‌ను కార్తి ఫిల్మ్ తీవ్రంగా నిరాశకు గురిచేసింది. తమిళంలో ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’తో కాంపిటీషన్ ఉన్నప్పటికీ.. తెలుగు నాట ‘జపాన్’కు పోటీనే లేదు. దీంతో మంచి టాక్ వస్తే ఇక్కడ కలెక్షన్స్ అదిరిపోయేవి. కానీ తమిళంతో పాటు తెలుగులోనూ పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. ‘జపాన్’ ట్రైలర్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, మెరుపులు సినిమాలో లేవని ఆడియెన్స్ అంటున్నారు. ట్రైలర్లో ఆకట్టుకున్న సీన్లు కూడా మూవీలో తేలిపోవడంతో ‘జపాన్’పై నెగెటిక్ టాక్ మరింత పెరిగింది. ఈ సినిమాలో తన మాడ్యులేషన్ హైలైట్ అవుతుందని కార్తి అనుకున్నారు. ప్రమోషన్స్‌లో అదే మాడ్యులేషన్‌తో మాట్లాడుతూ సందడి చేశారు కార్తి. దీన్నే ఆడియెన్స్‌లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు.
హైలైట్ అవుతుందని అనుకుంటే.. సినిమాలో ఒక స్టేజ్ దాటాక హీరో మాడ్యులేషన్ డైలాగ్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పించాయని టాక్. స్టోరీ మూసగా ఉండటం, స్క్రీన్‌ప్లే విసుగెత్తించి సినిమాను నీరుగార్చేశాయి. ‘జపాన్’ ఫిల్మ్‌లో హీరో కార్తి క్యారెక్టర్లో పెద్దగా బలం లేకపోవడం, హీరో మాడ్యులేషన్ క్లిక్ కాకపోవడంతో మూవీ ఎవ్వరికీ ఎక్కలేదు. అయితే కథ, కథనాలు ఇంత వీక్‌గా ఉన్నా కేవలం మాడ్యులేషన్ కోసమే ఆ క్యారెక్టర్‌ను ఎంచుకొని కార్తి తప్పు చేశాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. పాత్రలో బలం లేకపోయినా వెరైటీగా ఉంటుందని మాడ్యులేషన్‌ను నమ్ముకోవడం దెబ్బతీసిందని చెబుతున్నారు. మైల్స్టోన్ మూవీ కాబట్టి తొందరపడకుండా మంచి కథతో వచ్చుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరి.. కార్తి ‘జపాన్’ మూవీ మీరు చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రభాస్ టు కమల్.. స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోస్ వైరల్!