Somesekhar
కమల్ హాసన్ కు భారతీయుడు 2 కోసం ఊహించని పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
కమల్ హాసన్ కు భారతీయుడు 2 కోసం ఊహించని పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
‘భారతీయుడు’.. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం. అలాంటి మూవీకి దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత రీమేక్ వస్తుందనడంతో ప్రేక్షకుల్లో ఎక్కడాలేని ఆసక్తి క్రియేట్ అయ్యింది. భారతీయుడు 2తో కమల్ హాసన్-శంకర్ లు జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మార్నింగ్ షో నుంచే సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ తొలిరోజు వసూళ్లలో ఏ మాత్రం తగ్గలేదు కమల్. భారీ ఓపెనింగ్స్ నే రాబట్టాడు. ఇక కమల్ కు భారతీయుడు 2 కోసం ఊహించని పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయుడు 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా మెుత్తం వృద్ధుడి గెటప్ లోనే కనిపించి.. మెస్మరైజ్ చేశాడు. కానీ సేనాపతి దేని కోసం పోరాటం చేశాడు? అనేదానిపై క్లారిటీ లేదని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ సీక్వెల్ కోసం కమల్ తీసుకున్న పారితోషికం న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. భారతీయుడు 2, 3 కి కలిపి కమల్ రూ. 200 కోట్లు అడిగారట. కానీ మేకర్స్ ఒక్కో పార్ట్ కు రూ. 75 కోట్లు ఇస్తామని నిర్మాతలు అంగీకరించారట. అంటే రెండు భాగాలకు కలిపి రూ. 150 కోట్లు అన్నమాట. దాంతో ఈ ఏజ్ లో కూడా ఈ రేంజ్ పారితోషికం ఏంటి సామీ అంటూ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
ఇదిలా ఉండగా.. భారతీయుడు 2, 3 పార్ట్ లకు కలిపి రూ. 500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే శంకర్ పారితోషికం కూడా కలిపి ఉన్నట్లు సమాచారం. అయితే కల్కి మూవీకి కమల్ రూ. 20 కోట్లు, విక్రమ్ సినిమాకు రూ. 50 కోట్లు తీసుకోగా.. భారతీయుడు 2 మాత్రం ఏకంగా రూ. 75 కోట్లు తీసుకుని షాక్ కు గురిచేశాడు. దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో.. ప్రేక్షకులు ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్లకు వెళ్లారు. కానీ అసంపూర్తిగా రెండో భాగం ముగించి.. మూడో భాగంలో ఇంకా ఉందని చూపించడంతో.. ప్రేక్షకులు నిరాశకు గురైయ్యారు.