Somesekhar
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ రిలీజ్ అవుతుంటే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ రిలీజ్ అవుతుంటే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
Somesekhar
‘భారతీయుడు 2’ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం. 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి ఇది సీక్వెల్ గా వస్తోంది. జూలై12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. అయితే తెలంగాణలో టికెట్స్ రేట్ పెంచడం మూవీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అన్నది రేపు తేలుతుంది. తమిళనాడులో కంటే తెలంగాణలోనే టికెట్ రేట్లు ఎక్కువ కావడం గమనార్హం. భారతీయుడు 2 రిలీజ్ అవుతుంటే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. మరి దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
భారతీయుడు 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. తెలంగాణలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ఏపీలో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక భారతీయుడు 2 మూవీ కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఈ చిత్రం విడుదల అవుతుంటే.. చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. కారణం ఏంటంటే? శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దాదాపు ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో రేపు విడుదల అయ్యే భారతీయుడు 2 ఫలితం కచ్చితంగా గేమ్ ఛేంజర్ పై పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఈ విషయమే చరణ్ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురించేస్తోంది.
ఇక కమల్, శంకర్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా భారతీయుడు 2 మూవీ హిట్ కావాలని చెర్రీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మూవీ హిట్ అయితేనే గేమ్ ఛేంజర్ పై పాజిటీవ్ బజ్ ఏర్పడుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. దాంతో భారతీయుడు 2 చిత్రం విజయం సాధించాలని చరణ్ అభిమానులు గట్టిగా ప్రార్థిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ శంకర్ కు సైతం సాలిడ్ హిట్ లేక చాలా కాలం అవుతుంది. హీరో సిద్ధార్థ్ సైతం బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. చూడాలి మరి కమల్-శంకర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేదా? అన్నది.