Dharani
టికెట్ రేట్లకు సంబంధించి.. కల్కి టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాయి. దాంతో ధర పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆ వివరాలు..
టికెట్ రేట్లకు సంబంధించి.. కల్కి టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాయి. దాంతో ధర పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశం, ప్రపంచవ్యాప్తంగా అమితాసక్తి ఉన్న సినిమా కల్కి 2898ఏడీ. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈసినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈసినిమాకు డైరెక్టర్. ఇక ఇప్పటికే కల్కి సినిమా నుంచి వెలువడిన ప్రతి అప్డేట్, టీజర్, ట్రైలర్లు.. మూవీ మీద అంచనాలను ఓ రేంజ్‌లో పెంచాయి. ట్రైలర్లు చూసిన జనాలు.. హాలీవుడ్‌కు సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా.. అద్బుతంగా తెరకెక్కించారు.. కల్కి ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. కల్కి రెండు ట్రైలర్స్ ద్వారా చాలా వరకు సినిమా స్టోరీ, దానిలో ఉండే పాత్రల గురించి పరిచయం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే అసలు సస్పెన్స్.. కల్కి ఎవరు అనేది మాత్రం మిస్టరీగానే ఉంది. ఇది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక జూన్ 27న అనగా మరో 5 రోజుల్లో కల్కి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కల్కి విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో.. చిత్ర బృందం ప్రమోషన్లు పెంచింది. దాంతో పాటు టికెట్ రేట్ల పెంపుకై ప్రయత్నాలు చేస్తోంది కల్కి టీమ్. ఈ క్రమంలో కల్కి టీమ్.. సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడం కోసం టీం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ ప్లెక్స్, సింగిల్ థియేటర్ అనే తేడా లేకుండా టికెట్ ధర మీద రూ.వంద అదనంగా పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కల్కి టీమ్ కోరింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్‌లో అయితే టికెట్ రేటు మీద రూ.75, సింగిల్ థియేటర్ అయితే టికెట్ మీద 100 చొప్పున అదనంగా పెంచుకునేందుకు.. కల్కి టీమ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అలానే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెల్లవారుఝామున 5 గంటల ఆట కోసం అనుమతి కోరుతూ.. దరఖాస్తు చేశారని తెలుస్తోంది. తెలంగాలో కాంగ్రెస్, ఏపీలో కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం సినిమా రంగం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్న క్రమంలో రేట్లు పెంచుకోవడనికి అనుమతులు రావడం దాదాపు ఖాయం అనే అంటున్నారు. అదే జరిగి.. టికెట్ ధర పెరిగితే.. కల్కి తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ కల్కి 2898 ఏడీ నుంచి శుక్రవారం నాడు రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిలోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ద్వారా సినిమాకు సంబంధించి మరి కొన్ని ఆసక్తికర అంశాలు, పాత్రలను పరిచయం చేశారు. ఇకమాధవ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే పాట కూడా ఎంతో ఎమోషనల్‌గా ఉంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ రిలీజ్ ట్రైలర్‌తో అంచనాలు మాత్రం పెంచేశారు. ఈ ట్రైలర్‌తో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఇక ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్‌తో కల్కి రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఆల్రెడీ రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది.