iDreamPost
android-app
ios-app

RRR రికార్డు బ్రేక్ చేసిన కల్కి2898AD! ఆ జాబితాలో మూడో స్థానం..

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2998 ఏడి’ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా..మరో రికార్డును అధికమించింది.

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2998 ఏడి’ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా..మరో రికార్డును అధికమించింది.

RRR రికార్డు బ్రేక్ చేసిన కల్కి2898AD! ఆ జాబితాలో మూడో స్థానం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే రికార్డుల పరంపరను కొనసాగించాయి. అలాంటి అరుదైన సినిమాల్లో..ఇటీవల విడుదలన ‘కల్కి 2898ఏడీ’  ఒకటి. ఈ  మూవీ రిలీజైన రోజు నుంచి రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ భారీ వసూళ్లు దిశగా సాగుతోంది. అలానే ఇప్పటికే అనేక రికార్డులను బద్దలకొట్టిన కల్కి.. తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా క్రాస్ చేసింది. మరి.. ఆ రికార్డు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2998 ఏడి’ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలై 25వ రోజు నడుస్తున్న కుడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.  ఇదే సమయంలో కల్కి 2898ఏడీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ను వెనక్కి నెట్టింది. ఏకంగా ఆ జాబితాలో మూడో స్థానంలో ‘కల్కి2898ఏడీ’ నిలిచింది.  ఈ నెల నాలుగో ఆదివారమైన జూలై 21వ తేదీన కూడా ఈ సినిమా వసూళ్లు భారీగానే ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే.. ఇటీవలే విడుదలైన తెలుగు, హిందీ సినిమాలను కూడా మించి ఈ మూవీ వసూళ్లు సాధిస్తోంది. ఆదివారం ఈ సినిమా ఇండియా వైడ్ మార్కెట్ లో ఏకంగా రూ.8.25 కోట్లు వసూలు చేసింది. దీంతో 25 రోజుల మొత్తం కలిపి మన దేశంలో కల్కి 2898 ఏడీ రూ.616.7 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. కల్కి 2898 ఏడీ మూవీ 25వ రోజు కలెక్షన్లు చూస్తే.. బాలీవుడ్ లో మార్కెట్ లోనే రూ.4.85 కోట్లు వచ్చాయి. దీంతో అక్కడ కల్కి2898ఏడీ సినిమా మొత్తం వసూళ్లు రూ.310 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సౌత్ సినిమాల్లో తొలి స్థానంలో బాహుబలి 2 రూ.702 కోట్లు, రెండో స్థానంలో కేజీఎఫ్ 2 రూ.525 కోట్లతో ఉన్నాయి.

ఇక కల్కి2898 ఏడీ.. రూ.310 కోట్లతో మూడో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్ఆర్ఆర్ హిందీ మార్కెట్ లో మొత్తంగా రూ.306.2 కోట్లు వసూలు చేసింది. హిందీలో సర్ఫిరా, బ్యాడ్ న్యూస్ లాంటి సినిమాలు ఉన్నా.. వాటిని అధిగమించి ఈ కల్కి 2898 ఏడీ వసూళ్లు సాధిస్తోంది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద కల్కి వేటా పరంపర కొనసాగుతూనే ఉంది. మరి..ట్రిపుల్ ఆర్ రికార్డును బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి