iDreamPost
android-app
ios-app

నడుముపై టాటూ వేయించుకున్న ‘కల్కి’ భామ! ఇలా ఉందేంటి బ్రో!

  • Published Jul 09, 2024 | 12:48 PM Updated Updated Jul 09, 2024 | 12:48 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  కల్కి మేనియా నడుస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దదూసుకెళ్తోంది. ఈ సినిమాలో నటించిన ఓ భామ శరీరంపై ఉన్న టాటూ ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  కల్కి మేనియా నడుస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దదూసుకెళ్తోంది. ఈ సినిమాలో నటించిన ఓ భామ శరీరంపై ఉన్న టాటూ ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది.

  • Published Jul 09, 2024 | 12:48 PMUpdated Jul 09, 2024 | 12:48 PM
నడుముపై టాటూ వేయించుకున్న ‘కల్కి’ భామ! ఇలా ఉందేంటి బ్రో!

సినిమా సెలబ్రిటీలు ఏ పని చేసిన.. అది న్యూస్ అవుతుంది. ముఖ్యంగా వారు ధరించే డ్రెస్సెస్, వినియోగించే వస్తువులు, వాహనాలు అన్నీ వైరల్ అవుతుంటాయి. ఇక మరికొందరు సెలబ్రిటీలు చేసే పనులు చాలా విచిత్రంగా కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా టాటూకు సంబంధించి..సెలబ్రిటీలు వారి వారి స్టైల్ లో వేయించుకుంటారు. కొందరి టాటూలు చూస్తే..చాలా విచిత్రంగా ఉంటాయి. తాజాగా కల్కి 2898ఏడీ మూవీ బ్యూటీ కూడా టాటూ వేయించుకుంది. నడుముపై టాటు వేసుకున్న ఫోటోనున ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టింది. మరీ.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  కల్కి మేనియా నడుస్తోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించారు. కేవలం 11 రోజుల్లనే రూ.900 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇందులో అమితాబచ్చన్, కమల్ హాసన్, శోభన, దీపిక పదుకోనే వంటి సెలబ్రిటీలు నటించారు. వీరితో పాటు కొందరు యంగ్ బ్యూటీలు కూడా ఇందులో కనిపించారు. లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటానీ. ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. దిశా పటానీతో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.

కాగా.. ఇటీవల దిశా పటానీ పీడీ అనే టాటూతో వార్తల్లో నిలిచింది. తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ తన నడుముపై టాటూతో కనిపించింది. ప్రభాస్ కల్కితో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో దిశా పటానీ శరీరంపై మనకు అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ దర్శనమిచ్చింది. ఇక ఈ భామ నడుముపై వేయించుకున్న టాటూ.. సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నెటిజన్స్‌ దీని గురించి తెగ ఆరా తీస్తున్నారు. అసలు అర్థం కానీ భాషల్లో ఉన్న ఆ టాటూ ఏంటని చర్చించుకుంటున్నారు. అంతేకాక ఆ టాటూ అర్థం ఏమిటా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిశా పటాని శరీరంపై ఉన్న టాటూకు గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ బ్యూటీ వేయించుకున్న టాటూ హీబ్రూ అనే భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భాషను ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో మాట్లాడతారు.  అంతేకాక ‘అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు’ అనేది ఆ టాటూ అర్థమని సమాచారం. దీంతో ఈ టాటూపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టాటూ అర్థం తెలుసుకునేందుకు హీబ్రూ నేర్చుకోవాలా? అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది చూస్తుంటే కేవలం సినిమా షూటింగ్‌ కోసమే వేయించుకున్న టాటూలా అనిపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాక్సీ గెటప్‌లో ఉన్న ఈ భామ ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet