Nidhan
Devara Movie, Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో ‘దేవర’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Devara Movie, Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో ‘దేవర’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Nidhan
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో ‘దేవర’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూవీ నుంచి బయటకు వస్తున్న ఒక్కో కంటెంట్ ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేస్తోంది. దీంతో తారక్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్‌స్క్రీన్ మీద చూసేద్దామా అని అభిమానులు, ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ సాధించాల్సినవి చాలానే ఉన్నాయి. తెలుగు నాట ఎలాగూ తారక్‌కు ఉన్న క్రేజ్, కొరటాల శివ మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో థియేటర్స్ హౌజ్‌ఫుల్ అవుతాయి. టాక్ కాస్త బాగున్నా వసూళ్ల జాతర నడుస్తుంది. కానీ ఎన్టీఆర్‌కు అసలు సవాల్ మాత్రం నార్త్ మార్కెట్ అనే చెప్పాలి.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లో ‘దేవర’ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తర్వాత ఎన్టీఆర్‌కు కన్నడ మార్కెట్లో గట్టి గ్రిప్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి భారీగా వసూళ్లు రావడం ఖాయం. తమిళం, మలయాళాన్ని పక్కనబెడితే.. హిందీలో ‘దేవర’కు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయనేది కీలకంగా మారింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో ఉత్తరాదిన తారక్‌కు మంచి క్రేజ్, పాపులారిటీ వచ్చింది. ఆల్రెడీ డబ్బింగ్ మూవీస్ ద్వారా అక్కడ ఫేమ్ సంపాదించిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ‘ఆర్ఆర్ఆర్’తో నార్త్ ఆడియెన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా సెటిల్ అవడం ఆయన ముందున్న టార్గెట్. అది సాధ్యమవ్వాలంటే ‘దేవర’ హిందీ వెర్షన్ భారీగా ఓపెనింగ్స్ రాబట్టాలి. ఆ మూవీ అక్కడ హిట్ అయితే తారక్‌కు ఎదురుండదు.
తెలుగు నాట టాక్‌తో సంబంధం లేకుండా ‘దేవర’కు దండిగా వసూళ్లు రావడం ఖాయం. ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. టాక్ బాగుంటే బాక్సాఫీస్‌ను బద్దలుకొడుతుంది. కానీ తారక్ ఊచకోత కోయాల్సింది బాలీవుడ్లోనే. నార్త్‌లో వసూళ్ల జాతర చేయాలనే ఉద్దేశంతోనే తొలుత ప్రమోషన్స్ కూడా అక్కడే స్టార్ట్ చేశారు. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కరణ్ జోహార్‌తో చిట్ చాట్‌తో పాటు బాలీవుడ్లోనే ట్రైలర్ లాంఛింగ్ కూడా చేశారు. టాక్ బాగుంటే సినిమా ఎలాగూ హిట్ అవుతుంది. కానీ ఓపెనింగ్స్ అనేది క్రేజ్, పాపులారిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నార్త్‌లో ‘దేవర’తో తారక్ ఈ విషయాలన్నీ ప్రూవ్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ గట్టిగా సౌండ్ చేసేందుకు ఆయన జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కలిసొచ్చి తెలుగుతో పాటు హిందీలోనూ గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చి మూవీ హిట్ అయితే తారక్ క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మరి.. ‘దేవర’ హిందీలో ఊచకోత కోస్తాడా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.