iDreamPost
android-app
ios-app

‘దేవర’ కోసం ఎన్టీఆర్.. ఇదివరకు ఎన్నడూ చేయని సాహసం..!

  • Author ajaykrishna Updated - 01:59 PM, Tue - 29 August 23
  • Author ajaykrishna Updated - 01:59 PM, Tue - 29 August 23
‘దేవర’ కోసం ఎన్టీఆర్.. ఇదివరకు ఎన్నడూ చేయని సాహసం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో.. ఫ్యాన్స్ లో రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ని ఇదివరకు ఎన్నడూ చూడని మాస్ అవతారంలో.. కొరటాల తెరపై ప్రెజెంట్ చేయనున్నట్లు.. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా అన్ని రకాల యాక్షన్ సీక్వెన్స్ లు చేసేందుకు రెడీ అయిపోయాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో డెబ్యూ చేయబోతుంది. కాగా.. సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర గురించి.. రోజుకో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న దేవర.. ప్రెజెంట్ మూడో షెడ్యూల్ కి రెడీ అవుతోందట. అయితే.. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. అదేంటంటే.. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ చేత అదిరిపోయే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారట. దాని కోసం ప్రస్తుతం ఎన్టీఆర్.. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. అండర్ వాటర్ సీక్వెన్స్ అనేది ఎన్టీఆర్ ఇదివరకు ఎన్నడూ చేయనిది. ఈ లెక్కన దేవర కోసం సాహసమే చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. దేవర మూవీ పోర్ట్ ఏరియాలో సాగుతుందని.. ఇంతకుముందు ఎన్నడూ చూడని రక్తపాతాన్ని ఇందులో చూడబోతున్నామని ఆల్రెడీ కొరటాల శివ హింట్ ఇచ్చాడు. పైగా మృగాళ్ళను భయపెట్టే క్యారెక్టర్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో ఊహించుకోవాలో ఫ్యాన్స్ కే అర్ధం కావట్లేదు. ఈ క్రమంలో మూవీలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. కాగా.. సినిమాకు ట్రెండింగ్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా ఇది. దీంతో ప్రేక్షకులలో దేవరపై మినిమమ్ అంచనాలు సెట్ అయిపోయాయి. ఈసారి ఈ క్రేజీ కాంబో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందిస్తారో చూడాలి. మరి దేవర గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş