iDreamPost
android-app
ios-app

Jr. NTR: దేవర నుంచి స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్! ఫ్యాన్స్ ఖుషీ..

  • Published Aug 14, 2024 | 7:21 AM Updated Updated Aug 14, 2024 | 7:21 AM

దేవర మూవీకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

దేవర మూవీకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 14, 2024 | 7:21 AMUpdated Aug 14, 2024 | 7:21 AM
Jr. NTR: దేవర నుంచి స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్! ఫ్యాన్స్ ఖుషీ..

తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. దానికితోడు ఈ అప్డేడ్స్ వల్ల మూవీపై హైప్ క్రియేట్ అవుతుంది. అది భారీ ఓపెనింగ్స్ కు కారణంగా మారుతుంది. ఈ విషయంలో దేవర మేకర్స్ పుల్ స్పీడ్ లో ఉన్నారు. ఈ చిత్రం నుంచి వరుసగా క్రేజీ అప్డేట్స్ తో పాటుగా ప్రమోషనల్ కంటెంట్ ను వదులుతూ.. సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా సాలిడ్ అప్డేడ్ ఇచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

‘దేవర’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. ఇందులో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేవర నుంచి వచ్చిన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇక ఆయుధ పూజలో దేవర ఎంట్రీ సీన్స్ గురించి ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. దేవర ఎంట్రీ ఇచ్చే ఈ పది నిమిషాల యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయట.

solid update from ntr

ఇదిలా ఉండగా.. ఈ మూవీకి సంబంధించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. “దేవర పార్ట్ 1కి సంబంధించి నా చివరి షాట్ ను కంప్లీట్ చేసుకున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇందులో మీరు(మూవీ టీమ్) చూపించిన సముద్రమంత ప్రేమకు నా ధన్యవాదాలు, దాన్ని నేను మిస్ అవుతున్నాను.  కొరటాల శివ తీసుకెళ్లే అద్భుత ప్రపంచంలోకి వెళ్లడానికి ప్రేక్షకులతో పాటుగా నేను కూడా వేచి ఉండలేకపోతున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో.. తారక్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక దేవర మూవీకి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet