iDreamPost
android-app
ios-app

దేవరను వదలని కష్టాలు.. మరో సారి లీకులు.. ఈ సారి ఏంటంటే

  • Published Jul 29, 2024 | 12:42 PM Updated Updated Jul 29, 2024 | 12:42 PM

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దేవరకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే రెండు సార్లు దేవర నుంచి కొన్ని ఫోటోస్ లీకయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా దేవర నుంచి మరోసారి ఇదే సీన్ రిపీట్ అయ్యింది

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా దేవర. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దేవరకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే రెండు సార్లు దేవర నుంచి కొన్ని ఫోటోస్ లీకయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా దేవర నుంచి మరోసారి ఇదే సీన్ రిపీట్ అయ్యింది

  • Published Jul 29, 2024 | 12:42 PMUpdated Jul 29, 2024 | 12:42 PM
దేవరను వదలని కష్టాలు.. మరో సారి లీకులు.. ఈ సారి ఏంటంటే

సినీ ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు థియోటర్ లో ఎప్పుడెప్పపుడు చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇక దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణద్ రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. ఎప్పుడెప్పుడు దేవర నుంచి ఏ అప్ డేట్ వస్తుందానని ఎన్టీఆర్ అభిమానులు కూడా తెగ ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. కానీ, అప్ డేట్ విషయాల పక్కన పెడితే దేవర సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే రెండు సార్లు దేవర నుంచి కొన్ని ఫోటోస్ లీకయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా దేవర నుంచి మరోసారి ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇంతకి ఏం జరిగిందంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ‘దేవర’. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక దేవర సినిమా కోసం ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన ఫ్యాన్స్ సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. దేవర షూటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తాలు తీసుకుంటున్న తరుచు సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్, వీడియోలు లీకైపోతున్నాయి. అలా ఇప్పటికే రెండు సార్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి దేవర షూటింగ్ సెట్‌లో నుంచి ఎన్టీఆర్ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో ఇప్పటివరకూ కనిపించిన దేవర లుక్‌తో పోలిస్తే ఈ ఫోటోలో ఎన్టీఆర్ కాస్త ఢిపరెంట్ గా ఉన్నారు. ఇక ఆ ఫోటోలో ఎన్టీఆర్ బ్లాక్ షర్ట్ లో కాస్త గుబురు గడ్డంతో, తక్కువ జుట్టుతో తారక్ కనిపించారు.

అయితే ఇప్పటివరకూ చూపించిన దేవర లుక్‌లో తక్కువ గడ్డం, ఉంగరాల జుట్టుతో ఎన్టీఆర్ కనిపించారు. కానీ, ఇప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోను తెగ హల్ చల్ చేస్తున్నారు.  అయితే దేవర సెట్స్ నుంచి ఇలా లీకులు కావడం కొత్తేమీ  కాదు.  గతంలో గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బీచ్‌లో తీసిన ఓ సన్నివేశం ఇలానే లీకైంది. అందులో బీచ్ ఒడ్డున ఎన్టీఆర్ నడుస్తూ వస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత గోవాకి సంబంధించిన షూటింగ్‌లోనే పడవ సీన్ కూడా ఒకటి లీకైంది. దీనిపై మూవీ టీమ్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా దేవరకి లీకులు తప్పడం లేదు.

ఇక దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా..  హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకూ మూవీ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ రెండో భాగంలో ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరీ, దేవర సినిమా నుంచి మరోసారి ఎన్టీఆర్ ఫోటో లీకవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgray girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom