iDreamPost
android-app
ios-app

ఇటుక ఇటుకపై జూనియర్ NTR పేరు.. అప్పట్లో జై శ్రీరామ్ లాగా

  • Published Nov 04, 2023 | 7:59 PM Updated Updated Nov 04, 2023 | 7:59 PM

ఇటుకలపై పేర్లు అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది రామనామమైన జై శ్రీరామ్. గతంలో అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు జై శ్రీరాం అనే పేరుతో ఉన్న ఇటుకలు తయారు చేయించి అయోధ్యకు పంపించారు.

ఇటుకలపై పేర్లు అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది రామనామమైన జై శ్రీరామ్. గతంలో అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు జై శ్రీరాం అనే పేరుతో ఉన్న ఇటుకలు తయారు చేయించి అయోధ్యకు పంపించారు.

  • Published Nov 04, 2023 | 7:59 PMUpdated Nov 04, 2023 | 7:59 PM
ఇటుక ఇటుకపై జూనియర్ NTR పేరు.. అప్పట్లో జై శ్రీరామ్ లాగా

టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన నటనతో అద్భుతమైన డ్యాన్సులతో అదరగొట్టగల సత్తా ఉన్నోడు తారక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ కటౌట్లు కట్టి, పూజలు చేస్తూ బ్యాండ్ బాజాలతో థియేటర్ల ముందు సందడి చేస్తారు. ఈ క్రమంలో ఓ అభిమాని వినూత్నంగా అభిమానం చాటుకున్నాడు. ఏకంగా లక్షల కొద్ది ఇటుకలపై ఎన్టీఆర్ పేరును ముద్రించాడు.

ఇటుకలపై పేర్లు అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది రామనామమైన జై శ్రీరామ్. గతంలో అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు జై శ్రీరాం అనే పేరుతో ఉన్న ఇటుకలు తయారు చేయించి అయోధ్యకు పంపించారు. ఇది రాముడిపై భక్తులకు ఉన్న ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ఇదే మాదిరిగా ఓ అభిమాని జూనియర్ ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. అభిమాన హీరో గుండెల్లోనే కాదు ఇంట్లో కూడా ఉండే విధంగా ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే ఇటుకలను ఎన్టీఆర్ పేరుతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు.

ఆ ఇటుకలతోనే సొంత ఇల్లును నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ఆంద్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. కర్నూల్ కు చెందిన ఆ అభిమాని ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ కారణంగానే తన అభిమాన హీరోపై తనకున్న ప్రేమను, ఇష్టాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కర్నూల్ జిల్లా తారక్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఎన్టీఆర్ పేరు గల ఇటుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. సముద్రమంత ప్రేమ మా తారక రామారావు సొంతం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet