iDreamPost
android-app
ios-app

తారక్ భారీ రికార్డు! కానీ.., బన్నీని దాటలేకపోయాడు!

  • Published Nov 11, 2023 | 5:22 PM Updated Updated Nov 11, 2023 | 5:22 PM

భారీ యాక్షన్స్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా దేవర విడుదల కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా యంగ్ టైగర్ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కానీ బన్నీని దాటలేకపోయారు.

భారీ యాక్షన్స్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా దేవర విడుదల కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా యంగ్ టైగర్ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కానీ బన్నీని దాటలేకపోయారు.

  • Published Nov 11, 2023 | 5:22 PMUpdated Nov 11, 2023 | 5:22 PM
తారక్ భారీ రికార్డు! కానీ.., బన్నీని దాటలేకపోయాడు!

టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాల్లో బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో దివికేగిన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తారక్ సాధించిన ఈ రికార్డు.. బన్నీ రికార్డును దాటలేకపోయిందని సమాచారం.

దర్శక ధీరుడు జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దేవర మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్ అత్యధిక ధరకు రూ. 27 కోట్లకు ఓ సంస్థ దక్కించుకున్నట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే తెలుగు సినిమాకు ఈ మధ్య కాలంలో ఇంత ధర పలకడం విశేషం. అయితే గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ సినిమా ఆడియె రైట్స్ కు పలికిన ధరకంటే దేవర రెండవ స్థానంలో ఉంది. పుష్ప చిత్రం సంగీత హక్కులు రూ. 45 కోట్లకు అమ్ముడయ్యాయి. పుష్ప మ్యూజిక్ కు వరల్డ్ వైడ్ గా ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సంగీత హక్కులు అధిక ధరకు అమ్ముడుపోయినప్పటకి పుష్పతో పోలిస్తే రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో తారక్ నటిస్తున్న దేవర మూవీ ఆడియో రైట్స్ కి భారీ ధర పలికినా బన్నీ నటించిన పుష్ప రికార్డును దాటలేక పోయారు. ఇక దేవర చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpipo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş