iDreamPost
android-app
ios-app

Devara: ‘దేవర’ ఐటెం సాంగ్​కు స్టార్ హీరోయిన్ ఓకే! తారక్​కు సరైన పోటీ!

  • Published Apr 19, 2024 | 5:13 PM Updated Updated Apr 19, 2024 | 5:13 PM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం విడుదల గురించి పాన్ ఇండియా లెవల్​లో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అప్​డేట్స్​ మీద కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం విడుదల గురించి పాన్ ఇండియా లెవల్​లో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అప్​డేట్స్​ మీద కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

  • Published Apr 19, 2024 | 5:13 PMUpdated Apr 19, 2024 | 5:13 PM
Devara: ‘దేవర’ ఐటెం సాంగ్​కు స్టార్ హీరోయిన్ ఓకే! తారక్​కు సరైన పోటీ!

‘దేవర’.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిల్మ్. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్​బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్​పోన్ చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన అప్​డేట్స్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసం ఓ క్రేజ్ న్యూస్. ‘దేవర’లో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఓ స్టార్ హీరోయిన్ తన డాన్స్​తో అలరించనున్నారని తెలుస్తోంది. తారక్​తో కలసి స్టెప్పులు వేయనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్టీఆర్ ‘దేవర’ను భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫిల్మ్​గా తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్​ విలన్​ రోల్​లో యాక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో.. తారక్ సరసన హీరోయిన్​గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ‘దేవర’లో జాన్వీతో పాటు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అలరించనున్నారట. అయితే బుట్టబొమ్మది ఫుల్ లెంగ్త్ రోల్ కాదట.. తారక్ సరసన ఐటెం సాంగ్​లో ఆమె స్టెప్పులు వేయనున్నారని సమాచారం. ఎన్టీఆర్​తో కలసి డ్యాన్స్ చేసేందుకు పూజ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. గతంలో యంగ్ టైగర్​తో కలసి ‘అరవింద సమేత’లో హీరోయిన్​గా యాక్ట్ చేశారు పూజ. ఇప్పుడు మరోమారు ఆయనతో కలసి తెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపరచిన ఓ స్పెషల్ సాంగ్​లో ఎన్టీఆర్-పూజా హెగ్డే జోడీ తమ డ్యాన్సులతో రచ్చ చేయనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం తారక్-పూజ కలసి డ్యాన్స్ చేస్తే అదిరిపోతుందని, ఆ పాట కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. డ్యాన్స్​లో ఎన్టీఆర్​కు ఆమె సరైన పోటీ అని అంటున్నారు. ఇక, పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలు లేక డల్ అయిపోయారు. వరుస ఫ్లాపులతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ సరసన సాంగ్​లో కనిపించే ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. కాగా, గతంలో పలు స్పెషల్ సాంగ్స్ చేశారు బుట్టబొమ్మ. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో జిగేల్ రాణి పాటతో యూత్​ను మెప్పించారామె. మరి.. తారక్-పూజ కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని మీరు కోరుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet