iDreamPost
android-app
ios-app

ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చిన సినిమా.. మాకొద్దంటున్నOTTలు!

Jhini Bini Chadariya: ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవాటిల్లో థియేటర్ల, ఓటీటీలు ప్రధానంగా ఉన్నాయి. అందుకే థియేటర్లలో  రిలీజైన సినిమాలు కచ్చితంగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.  ఎన్నో అవార్డులు గెలిచినా..ఓటీటీలో మాత్రం ప్రసారం కావడం లేదు.

Jhini Bini Chadariya: ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవాటిల్లో థియేటర్ల, ఓటీటీలు ప్రధానంగా ఉన్నాయి. అందుకే థియేటర్లలో  రిలీజైన సినిమాలు కచ్చితంగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.  ఎన్నో అవార్డులు గెలిచినా..ఓటీటీలో మాత్రం ప్రసారం కావడం లేదు.

ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చిన సినిమా.. మాకొద్దంటున్నOTTలు!

చాలా  చిన్న, పెద్ద సినిమాలు  థియేటర్లలో విడుదలవుతుంటాయి. అలా రిలీజైన కొన్ని రోజులకు ఈ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. అలా సూపర్ హిట్ అయిన సినిమాలు, అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక సినిమా క్రేజ్ ను పట్టి.. సొంతం చేసుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పోటీ పడుతుంటాయి. అలాంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్న సినిమాకు ఇంకెంత క్రేజ్ ఉంటాది. కానీ ఓ సినిమాకు విచిత్ర పరిస్థితి ఏర్పడింది.  ఎన్నో అవార్డులు గెలిచినా..ఓటీటీలో మాత్రం ప్రసారం కావడం లేదు. స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు రావడం లేదు. మరి..ఆ సినిమా ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేవాటిల్లో థియేటర్ల, ఓటీటీలు ప్రధానంగా ఉన్నాయి. అందుకే థియేటర్లలో  రిలీజైన సినిమాలు కచ్చితంగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అవార్డు గెలుచుకున్న చిత్రాలను అయితే బాక్సాఫీస్‌ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. జీనీబీనీ చడారియా(ద బ్రిటిల్ థ్రెడ్) సినిమా విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ లో జరుగుతుంది. ఆయన సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చినా.. ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు. తన సినిమాను మాత్రం ఎవరూ పట్టించుకోలేదని ఆ సినిమా దర్శకుడు రితేశ్‌ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రితేశ్‌ మొట్టమొదటి సారి దర్శకత్వం వహించిన సినిమా జీనీ బీనీ చడారియా. వారణాసి ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మేఘ మాథుర్‌, ముజఫర్‌ ఖాన్‌, శివన్‌ స్పెక్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. వారణాసి నగరం, అక్కడి సాంప్రదాయాలు, జీవన శైలి ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొన్ని పరిస్థితుల వల్ల రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయన్నది ఈ సినిమాలో చూపించారు.

ఇక ఈ సినిమాను దర్శకుడు ఎంతో చక్కగా తెరకెక్కించారు. 2021 నుంచి జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా 2022లో న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో బెస్ట్‌ డెబ్యూ ఫీచర్‌ ఫిలిం అవార్డు గెల్చింది. అలానే ఇండోగ్మ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ (సుప్రియ దాస్‌గుప్తా) పొందింది. ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ అహ్మద్‌నగర్‌లో ఉత్తమ నటిగా మేఘ మాథుర్, ఉత్తమ ఎడిటర్ గా భీష్మప్రతిం ఈ సినిమా నుంచి అవార్డులు గెలిచారు.

అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ సినిమా ఇంతవరకు అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవనేలేదు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావడం లేదు. కనీసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయినా స్ట్రీమింగ్ చేస్తుందా అంటే.. అదీ లేదు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రితేశ్‌ శర్మ ఎక్స్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. జీనీ బీనీ చడారియాను కొనేందుకు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆసక్తి చూపిండం లేదని అంసతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న సినిమాను కొనే సాహసం తాము చేయలేమని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయి అని ట్వీట్‌ చేశాడు. ఇక ఆయన ట్వీట్ చూసిన నెటినజన్లు సింపతి కామెంట్స్ చేస్తున్నారు.