iDreamPost
android-app
ios-app

జవాన్.. ట్రైలర్ రాకముందో లెక్క.. వచ్చాకో లెక్క!

  • Author ajaykrishna Updated - 11:41 AM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 11:41 AM, Sat - 2 September 23
జవాన్.. ట్రైలర్ రాకముందో లెక్క.. వచ్చాకో లెక్క!

ఇండస్ట్రీలో సినిమాల రిలీజులు దగ్గర పడుతున్నాయంటే ఖచ్చితంగా ఆయా హీరోలకు సంబంధించి ఫ్యాన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వాళ్ల హైప్ కి తగ్గట్టుగా సినిమాలు ఉంటే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా తిరుగుండదు అనే చెప్పాలి. ఇటీవల సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ మూవీ.. భారీ బజ్ క్రియేట్ చేసి థియేటర్స్ లో విడుదలైంది. తీరా థియేటర్స్ కి వెళ్ళాక ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యింది. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్. ఏకంగా రూ. 650 కోట్లకు పైగా వసూల్ చేసి.. ఇంకా విజయవంతంగా థియేటర్స్ లో రన్ అవుతోంది. అయితే.. జైలర్ మూవీ ట్రైలర్ రాకముందు సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేసి.. ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ కూడా అదే బాటలో వెళ్తోంది. ఇటీవల విడుదలైన సెకండ్ ట్రైలర్ కి ముందు.. సాంగ్స్ తో బజ్ పెంచిన జవాన్.. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా హైప్ పీక్స్ కి చేరుకుంది. దీంతో సినిమా మీద ఫ్యాన్స్ లో పఠాన్ ని మించి క్రేజ్ నెలకొందని చెప్పాలి. జైలర్ తర్వాత బిగ్గెస్ట్ సినిమాగా వస్తుంది జవాన్ మూవీనే. అందులోనూ సెప్టెంబర్ 7నే రిలీజ్ కాబట్టి.. అందరి కళ్లు దీనిపైనే పడ్డాయి. సాంగ్స్, ట్రైలర్ లతో వచ్చిన హైప్ ని రజినీకాంత్ జైలర్ సినిమా ఎలాగైతే కాపాడుకొని బ్లాక్ బస్టర్ అయ్యిందో.. ఇప్పుడు అలాంటి సవాలే జవాన్ ముందుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకుముందు పఠాన్ తో హైప్ క్రియేట్ చేసుకొని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు షారుఖ్. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. పైగా ట్రైలర్ లో డ్యూయెల్ రోల్.. ఇద్దరు హీరోయిన్స్.. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్.. హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అన్ని జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. మరి ట్రైలర్ కి ముందో లెక్క.. ట్రైలర్ వచ్చాక ఓ లెక్క అనిపించుకున్న జవాన్.. ఓవైపు కాపీ ట్రోల్స్ ని కూడా ఫేస్ చేస్తోంది. ఇన్ని సవాళ్ల మధ్య విడుదలై.. థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద తిరుగుండదు. లేదంటే కష్టమే అని టాక్ నడుస్తోంది. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన జవాన్ మూవీని.. గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, దీపికా హీరోయిన్స్ కాగా.. విజయ్ సేతుపతి విలన్. మరి జవాన్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet